కాలేజీ మీద చిరుత‌ దాడి.. స్టూడెంట్‌కు తీవ్ర గాయాలు

ఒక‌ప్పుడు అడ‌విలో మాత్ర‌మే క‌నిపించే చిరుత పులులు ఈ న‌డుమ ఇండ్ల‌లోకి వ‌చ్చేస్తున్నాయి.స‌డెన్ గా ఎంట్రీ ఇచ్చేసి నానా బీభ‌త్సం సృష్టిస్తున్నాయి.

 Cheetah Attack On College .serious Injuries To Student, Cheetah Attack, Viral Vi-TeluguStop.com

ఎక్క‌డ ఎవ‌రి మీద ఎలా దాడి చేస్తాయో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కావ‌ట్లేదు.ఇక అడ‌వుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రాంతాల జ‌నం అయితే ప్రాణాల‌ను అరచేతిలో పెట్టుకునే బ‌తుకుతుంటారు.

ఎందుకంటే ఎప్పుడు ఏ క్రూర జంతువు వ‌చ్చి దాడి చేస్తుందో తెలియ‌దు.మ‌రీ ముఖ్యంగా క్రూర మృగాల్లో చిరుత పులి దాడులే ఎక్కువ‌వుతున్నాయి.

ఇప్పుడు కూడా ఓ చిరుత ఇలాగే దాడి చేసింది.

ఏకంగా ఓ కాలేజీ మీద దాడి చేసి స్టూడెంట్‌ను తీవ్రంగా గాయపర్చింది.

ఈ ఘ‌ట‌న ఒక్క‌సారిగా అంద‌రినీ క‌ల‌వ‌రానికి గురి చేసింది.ఇక చిరుత దాడితో కాలేజీలో ఉన్న స్టూడెంట్లు, టీచ‌ర్లు ఒక్క‌సారిగా భయంతో పరుగులు పెట్టారు.

ఈ ఆందోళ‌న‌లో తొక్కిస‌లాట జ‌రిగి కొందరు స్టూడెంట్లు గాయపడ్డారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్‌ జిల్లాకు చెందిన ఛర్రా పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఈ విధంగా చిరుత దాడికి దిగిన‌ట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చెక్క‌ర్లు కొడుతోంది.ఈ కాలేజీ అడ‌వికి కొంచెం ద‌గ్గ‌ర‌గా ఉంది.

ఇక క్లాసులు జ‌రుగుతున్న క్ర‌మంలో చిరుత పులి స‌డెన్ గా కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.వ‌స్తూనే ఓ క్లాస్ రూమ్ లో ఉండే స్టూడెంట్ మీద దాడి తీవ్రంగా గాయ‌ప‌రిచింది.ఇక స్టూడెంట్లు, టీచ‌ర్ల అరుపుల‌కు ఆ పులి కాస్తా ఓ క్లాస్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంది.ఇక విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 9గంటలు రిస్క్యూ నిర్వహించి అతిక‌ష్టం మీద ఆ చిరుత‌ను ప‌ట్టుకున్నారు.

ఈ చిరుత ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ స్టూడెంట్ ఇప్పుడు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.అతడి హెల్త్ బాగానే ఉందని డాక్ట‌ర్లు వివ‌రిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube