నిన్న పూలు జల్లి.. ఈ రోజు సెటైర్లు : పరాగ్ అగర్వాల్‌ని స్టాలిన్‌తో పోల్చిన ఎలన్ మస్క్

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా నియమితులైన పరాగ్ అగర్వాల్ పేరు ఇప్పుడు భారత్‌తో పాటు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.ఇప్పటికే ప్రతిష్ఠాత్మక టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అడోబ్, మాస్టర్‌ కార్డ్‌లకు భారత సంతతి వ్యక్తులు అధిపతులుగా ఉండగా.

 Elon Musk Uses Stalin Meme To Take A Jab At Twitters Parag Agrawal Jack Dorsey,e-TeluguStop.com

ఇప్పుడు పరాగ్ అగర్వాల్ వారి సరసన చేరి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.ఈ నేపథ్యంలోనే ఆయనకు విశ్వవ్యాప్తంగా వున్న భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే టెస్లా, స్పేస్ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలన్ మస్క్ మాత్రం రోజుల వ్యవధిలో పరాగ్ అగర్వాల్ పట్ల విభిన్నంగా ప్రవర్తించారు.భారతీయుల ప్రతిభతో అమెరికా లబ్ధి పొందుతోందని మొన్న వ్యాఖ్యానించిన ఆయన.తాజాగా పరాగ్‌పై సెటైర్లు వేశారు.

ఏకంగా ఒకప్పటి సోవియట్ అధినేత, కమ్యూనిస్ట్ నేత జోసెఫ్ స్టాలిన్‌తోనే పోల్చారు.

ఈ మేరకు ఎలన్ మస్క్ ఓ ఫొటో ట్వీట్‌ చేశాడు.అది ఒక చారిత్రాత్మక, వివాదాస్పద ఫొటో.

ఇందులో స్టాలిన్‌ బాడీకి ట్విట్టర్‌ కొత్త సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ తలను, నికోలాయ్‌ బాడీకి ట్విట్టర్‌ మాజీ సీఈవో డోర్సే తలను అంటించాడు.ఒరిజినల్ ఫోటోలోని పై ఫ్రేమ్‌లో స్టాలిన్‌, ఆయన అంతరంగికుడు నికోలాయ్ యెజోవ్.

పక్కపక్కనే ఉంటారు.కానీ, కింద ఫ్రేమ్‌లో స్టాలిన్‌ ఫొటో మాత్రమే ఉంటుంది.

అందుకు కారణం లేకపోలేదు.తొలిరోజుల్లో స్నేహితులుగా ఉన్న నికోలాయ్‌-స్టాలిన్‌ మధ్య.

రాజకీయ కారణాలతో వైరం మొదలవుతుంది.ఈ తరుణంలో స్టాలిన్‌ ఆదేశాల మేరకే నికోలాయ్‌ హత్య కూడా జరిగిందని అప్పటి సోవియట్ రాజకీయ వేత్తలు కథలు కథలుగా చెప్పుకునేవారు.

ఈ కారణంతోనే వీళ్లిద్దరూ సరదాగా గడిపిన ఫొటో తర్వాతి రోజుల్లో రష్యాలో సెన్సార్‌ షిప్‌కు గురైంది.అలా స్టాలిన్‌ పక్క నుంచి నికోలాయ్ యెజోవ్ ఫొటోను తొలగించారు.

ఇంతటి ప్రాముఖ్యత గల ఫోటోను ఎలన్ మస్క్‌ ఇలా వాడేశారు.

ఇకపోతే.పరాగ్ అగర్వాల్ విషయానికి వస్తే.ముంబైలో పుట్టిపెరిగిన ఆయన ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు.

అనంతరం కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సీటిలో పై చదువులు చదివారు.తర్వాత మైక్రోసాఫ్ట్, యాహూ వంటి సంస్థలలో పనిచేసి 2011లో ట్విట్టర్‌లో చేరారు.2017లో సీటీవోగా ప్రమోషన్ లభించింది.ఆపై ప్రాజెక్ట్ బ్లూ స్కూ అనే టీమ్‌కు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube