మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ మధ్య సరికొత్తగా మేకోవర్ అయ్యి అభిమానులకు కొత్త ఫ్యాషన్ ను పరిచయం చేస్తున్నాడు.ఎప్పటికప్పుడు కొత్త లుక్ తో కనిపిస్తు మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాడు.
చరణ్ మోడ్రన్ లుక్ తో కొత్త కొత్త ఫ్యాషన్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.ఇక తాజాగా మరొకసారి చరణ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు.
ఈ ఫోటోలు ప్రసెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పిక్స్ లో చరణ్ సూర్యోదయం అవుతున్న సమయంలో మంచు కొండల మధ్య హాయిగా సేదతీరుతున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ప్రెసెంట్ రామ్ చరణ్ స్విడ్జర్లాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.బిజీ షెడ్యూల్ మధ్యలో కాస్త విరామం తీసుకుని వెకేషన్ కు వెళ్లినట్టు తెలుస్తుంది.
చరణ్ వెకేషన్ ముగించుకుని త్వరలోనే ఇండియా రాబోతున్నాడని తెలుస్తుంది.
ఇక చరణ్ ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేయబోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచబోతున్నారు చిత్ర యూనిట్.
ఇక చరణ్ వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియా కి రాగానే ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ ల్లో పాల్గొన బోతున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో పాటు చరణ్ తన తండ్రి చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ నటిస్తున్నాడు.
ఇది కూడా షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 4న విడుదల కాబోతుంది.
ఇక రామ్ చరణ్ గ్యాప్ లేకుండా వెంటనే తన తర్వాత ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసాడు.లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15′ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రసెంట్ షూటింగ్ జరుపుకుంటుంది.ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది.