మూడు భాషల్లో మూడు వందల రోజులు ఆడిన సినిమా ఏదో మీకు తెలుసా?

ఒక భాషలో ఒక సినిమా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే ఆ సినిమా వంద రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఆడుతుంది.ఎందుకంటే సినిమా సక్సెస్ అలాంటిదన్నమాట.

 Chandramukhi Movie Played Three Hundred Day In Three Languages Details, Tollywo-TeluguStop.com

ప్రేక్షకులను ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మెప్పించిందంటే చాలు థియేటర్ లలో కొన్ని రోజుల వరకు ఆ సినిమా హవానే నడుస్తుంది.అలా ఇతర భాషల్లో విడుదలైన కూడా కొన్ని కొన్ని సార్లు అటువంటి సక్సెస్ నే అందుకుంటుంది.

అలా ఓ సినిమా కూడా మూడు బాషల్లో మూడు వందల రోజులు ఆడింది.ఇంతకు ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.

2005లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తెలుగు డబ్బింగ్ సినిమా చంద్రముఖి. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించాడు.

అంతేకాకుండా నయనతార, ప్రభు, జ్యోతిక, వినీత్, నాజర్, సోనూసూద్ తదితరులు నటించారు.ఈ సినిమాకు పి.

వాసు దర్శకత్వం వహించాడు.విద్యాసాగర్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.

ఇక ఈ సినిమా కథ, నటన, పాటల పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 100 రోజులు ఆడింది.ఈ సినిమాను మలయాళ సినిమా నుండి రీమేక్ చేశారు.

మలయాళంలో ఈ సినిమా 1993లో ‘మణిచిత్రతజు’ అనే పేరుతో విడుదలయింది.ఇందులో మోహన్ లాల్ హీరోగా నటించాడు.

ఇక సురేష్ గోపి, శోభన తదితరులు నటించారు.

Telugu Chandramukhi, Jyothika, Nayantara, Nazar, Prabhu, Sonu Sood, Rajinikanth,

ఈ సినిమాకు ఫాజిల్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా దాదాపు 300 రోజులకు పైగా ఆడి రికార్డ్ బ్రేక్ చేసింది.అప్పట్లోనే ఈ సినిమా దాదాపు మూడు కోట్ల వసూలు చేయగా.

రెండు జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా.ఆ తర్వాత 2004 లో కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేశారు.‘ఆప్తమిత్ర’ అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు.

Telugu Chandramukhi, Jyothika, Nayantara, Nazar, Prabhu, Sonu Sood, Rajinikanth,

ఇందులో కన్నడ స్టార్ హీరో విష్ణువర్ధన్, సౌందర్య నటించారు.ఇక ఈ సినిమా మాత్రం ఏడాది వరకు ఆడి ఏకంగా చరిత్రని సృష్టించిందని చెప్పవచ్చు.ఈ సినిమా రిజల్ట్ చూసేసరికి రజినీకాంత్ మనసు మొత్తం ఈ సినిమాపై పడింది.

దీంతో ఈ సినిమాను రీమేక్ చేయాలని రజనీకాంత్ కోరడంతో 5 నెలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

Telugu Chandramukhi, Jyothika, Nayantara, Nazar, Prabhu, Sonu Sood, Rajinikanth,

అలా తెలుగులో చంద్రముఖి గా డబ్బింగ్ తో తెరకెక్కి తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా చెన్నై శాంతి థియేటర్లో 890 రోజులు ఆడింది.ఇక ఈ సినిమాకు కూడా ఎన్నో అవార్డులు అందాయి.

ఇందులో చంద్రముఖి పాత్రలో నటించిన జ్యోతిక మాత్రం ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా తర్వాత జ్యోతిక, నయనతార కూడా ఎన్నో అవకాశాలు అందుకొని మంచి సూపర్ సక్సెస్ లు సొంతం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube