లేటెస్ట్ బజ్.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Ram Charan And Jr Ntr’s Rrr Trailer New Date Fixed, Rrr Trailer, Rrr Trailer,-TeluguStop.com

రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.ఇక ఆయన చేస్తున్న సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి.

ఇక బాహుబలి తర్వాత అంతే భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా తీసాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ లో కూడా వేగం పెంచేశాడు రాజమౌళి.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్, పాటలు అన్ని కూడా మంచి స్పందన తెచ్చుకున్నాయి.

Telugu Alia Bhatt, Jr Ntr, Rajamouli, Ram Charan, Ramcharan, Rrr Trailer, Rrr Up

డిసెంబర్ 3న ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని.త్వరలోనే కొత్త డేట్ ను ప్రకటిస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.అయితే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి కొత్త డేట్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 7న కానీ లేదంటే 9న కానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Telugu Alia Bhatt, Jr Ntr, Rajamouli, Ram Charan, Ramcharan, Rrr Trailer, Rrr Up

ఈ రెండు డేట్ లలో ఒక డేట్ కి పక్క ఈ సినిమా ట్రైలర్ వస్తుందని సమాచారం.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే.చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తుండగా.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుంటే.చరణ్ కు జంటగా ఆలియా భట్ నటిస్తుంది.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube