అమ్మ బాబోయ్ : వీర్యం అమ్మి సంవత్సరానికి 24 కోట్లు సంపాదిస్తున్నాడట...

కూటి కోసం కోటి విద్యలని అప్పుడప్పుడు పెద్దలు సామెతలు చెబుతూ ఉంటారు.అయితే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ యుగంలో డబ్బు సంపాదించాలంటే తెలివితేటలు ఉంటే చాలు చదువు సంధ్యలతో పెద్దగా సంబంధం లేదని ఇప్పటికే చాలామంది నిరూపించారు.

 Jodhpur Arvind Jangid Selling Bheem Buffalo Sperm And Earn 24 Crore Per Early, B-TeluguStop.com

కనీసం బడి ముఖం చూడనటువంటి వారు కూడా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నారు.అయితే తాజాగా ఓ వ్యక్తి వీర్యం అమ్మి సంవత్సరానికి దాదాపుగా 24 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్పూర్ పరిసర ప్రాంతంలో అరవింద్ జంగిడ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే అరవింద్ తల్లిదండ్రులు కుటుంబ పోషణ నిమిత్తమై పాల వ్యాపారం చేసే వారు.

దీంతో వారికి గేదెల పై అవగాహన ఎక్కువగా ఉండేది.దీంతో చిన్నప్పటినుంచి గేదెల మధ్యలో పెరిగిన అరవింద్ పాలు ఇచ్చేటువంటి గేదెల పై అవగాహన బాగా పెంచుకున్నాడు.

దీంతో అరవింద్ కూడా గేదెల వ్యాపారం చేసేవాడు.అయితే తాజాగా అరవింద్ కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాడు.

ఇంతకీ ఆ వ్యాపారం ఏమిటంటే తన దగ్గర ఉన్నటువంటి గేదె వీర్యం అమ్మటం.దీంతో ఈ వ్యాపారం మొదలు పెట్టిన కొద్ది సంవత్సరాల్లోనే కోట్ల రూపాయలు ఆదాయం గడించాడు.

దాంతో తనకి కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చి పెడుతున్న తన గేదె కి భీమ్ అని నామకరణం చేశాడు.అయితే ఈ గేదె వీర్యకణాలను దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాడు.

దీంతో ప్రతి ఏటా దాదాపుగా 24 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతోంది.

అయితే ఈ గేదె యొక్క పోషణ నిమిత్తమై నెలకు దాదాపుగా రెండు లక్షల రూపాయలకి పైగా డబ్బు ఖర్చు చేస్తున్నాడు.

ఏదేమైతేనేం అరవింద్ చేస్తున్న ఈ పని పై పాల వ్యాపారం చేసే ఎంతోమంది కుటుంబాలు ఆధార పడ్డాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ విషయం తెలుసుకున్న కొంత మంది నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube