టాలీవుడ్లో దాదాపుగా 100కి పైగా చిత్రాలలో హీరోగా నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ నందమూరి నటసింహం “నందమూరి బాలయ్య బాబు” గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్య కాలంలో బాలయ్య బాబు హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా నటిస్తూ బాగానే ఆకట్టుకున్నాడు.
అయితే తాజాగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ అయిన నాగార్జున రెడ్డి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని నందమూరి బాలకృష్ణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తదితరులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కి సామాన్య ప్రజలను మరియు అధికారంలో ఉన్న అధికారులను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసని అందువల్లనే క్లిష్ట పరిస్థితులలో కూడా ఎలాంటి అపాయం లేకుండా బయట పడతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు.అలాగే ఆ మధ్య నందమూరి బాలకృష్ణ ఓ వివాదంలో ఇరుక్కున్నాడని అయితే ఈ వివాదం జరిగిన సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని దాంతో నారా చంద్రబాబు నాయుడు తన తెలివితేటలను ఉపయోగించి నందమూరి బాలకృష్ణ ని ఈ వివాదంలో నుంచి గట్టెక్కించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్న తర్వాత వైద్యుల ద్వారా సర్టిఫికెట్ తెప్పించి కోర్టులో సబ్మిట్ చేసి బాలకృష్ణని బయటికి తీసుకు వచ్చారని చెప్పుకొచ్చాడు.అంతటితో ఆగకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు నారా చంద్రబాబు నాయుడు తదితరులు లేకుంటే ఈ పాటికి నందమూరి బాలకృష్ణ జైలులో ఉండేవాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తెలుగులో “అఖండ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా బాలకృష్ణకు జోడీగా కంచె మూవీ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ చిత్రంలో జగపతి బాబు, సీనియర్ హీరో శ్రీకాంత్, హీరోయిన్ పూర్ణ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.ఈ చిత్రం ఈ నెల 3వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల కాబోతోంది.
గత కొద్ది రోజులుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న బాలయ్యబాబు అఖండ చిత్రంతో తనకు మళ్లీ విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.మరి అఖండ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.