ఢిల్లీ టూర్ కి బాబు గారు రెఢీ ? ట్విస్ట్ ఇవ్వాలనే ..?

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని, ఆ సంచలనం ద్వారా 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అనేక వ్యూహాలు రచిస్తున్నారు.దీనికి తగ్గట్టుగానే గత కొంత కాలంగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలు చేపడుతూ , వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగేలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

 Chandrababu Try To-go On Delhi Tour Chandrababu Delhi Tour, Ysrcp ,ap, Nara Bhuv-TeluguStop.com

  ఇటీవల తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి పరోక్షంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని రాజకీయంగా చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు.తమ కుటుంబసభ్యులకు జరిగిన అవమానం పై ప్రజల్లో సానుభూతి పెరిగిందని బాబు లెక్కలు వేసుకుంటున్నారు .ఇదే అంశంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆడపడుచుల ఆత్మగౌరవం పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అక్కడితో సరిపెట్టకుండా,  జాతీయ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం పై కక్ష తీర్చుకునేందుకు బాబు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నారు .ఈ మేరకు ఢిల్లీ వెళ్లి రాజకీయ చక్రం తిప్పాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు .డిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి ఏపీలో జరుగుతున్న పరిణామాలపైనా,  తన కుటుంబానికి జరిగిన అవమానం పైనా కేంద్ర బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని బాబు డిసైడ్ అయ్యారట.  ఈ మేరకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం టీడీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారట.

Telugu Amit Shah, Bhuvaneshwari, Prime, Primenarendra, Ysrcp-Telugu Political Ne

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండడంతో ఈ సమయంలోనే ఢిల్లీకి వెళితే ఎన్నో పనులు చక్కబెట్టుకోవచ్చు అనేది చంద్రబాబు లెక్క గా అర్థం అవుతోంది.ఇటీవలే ఏపీ లో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారనే ప్రచారం జరిగింది.  అయితే నేరుగా ఇప్పుడు ఆ వ్యవహారాలపై ఫిర్యాదు చేయడంతో పాటు,  పొత్తుల అంశాన్ని కూడా ప్రస్తావించాలనే ఆలోచనతోనే బాబు ఢిల్లీ టూర్ ఉండబోతోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube