సౌత్ లో ప్రభాస్.. నార్త్ లో సల్మాన్.. పుష్పరాజ్ కోసం ఇద్దరు స్టార్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 These Two Stars For Bunny Pushpa Movie Promotions, Allu Arjun, Bunny, Prabhas, P-TeluguStop.com

ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Telugu Allu Arjun, Bunny, Prabhas, Pushpa-Movie

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు.వారానికి ఒక అప్డేట్ ఇస్తూ ఈ సినిమాను జనాలకు మరింత చేరువ చేస్తూ మరిన్ని అంచనాలను పెంచేస్తున్నారు.ఇక రిలీజ్ కు 15 రోజులు మాత్రమే ఉండడంతో ఐకాన్ స్టార్ రంగం లోకి దిగుతున్నాడని తెలుస్తుంది.

పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ మొదటిసారి ఎంట్రీ ఇస్తుండడంతో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేయడానికి మేకర్స్ అంత సిద్ధం అయ్యారు.

అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇద్దరు స్టార్స్ ను లైన్లో పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న గ్రాండ్ గా జరగనుంది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గెస్ట్ గా ప్రభాస్ రాబోతున్నాడని గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది.

స్వయంగా అల్లు అర్జున్ ప్రభాస్ ను అడగగా ఆయన వెంటనే ఒప్పుకున్నాడని టాక్ వినిపిస్తుంది.

ఇక సౌత్ లో ప్రభాస్ తో ప్రొమోషన్స్ లో హైప్ తీసుకు రావాలని చూస్తుంటే.

ఇక నార్త్ లో కూడా మరొక బడా హీరోను లైన్లో పెట్టాడట.నార్త్ లో పుష్ప కోసం సల్మాన్ ఖాన్ రంగం లోకి దిగుతున్నట్టు తెలుస్తుంది.సల్మాన్ ఖాన్ ప్రెజెంట్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ద్వారా పుష్ప ప్రమోషన్స్ ను హిందీలో చేస్తున్నారట.ఈ షోకి గెస్ట్ గా అల్లు అర్జున్ వెళ్తున్నట్టు తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Telugu Allu Arjun, Bunny, Prabhas, Pushpa-Movie

నార్త్ లో ప్రేక్షకులు ఎక్కువగా చూసే షో బిగ్ బాస్ ద్వారా పుష్ప ప్రమోషన్స్ చేస్తే ఇక తిరుగుండదని అల్లు అర్జున్ భావించాడట.అందుకే ఈ షోను ఉపయోగించుకుని పుష్ప సినిమాను నార్త్ లో కూడా భారీ హైప్ క్రియేట్ చేయబోతున్నాడు బన్నీ.ఇక పుష్ప కోసం ఇక్కడ ప్రభాస్.అక్కడ సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగడం నిజమైతే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ రేంజ్ లోకి వెళ్లడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube