కొన్నిసార్లు బాధను మాటలతో చెప్పలేము : ఎన్టీఆర్

ఇటీవల టాలీవుడ్ లో వరుసగా విషాద వార్తలు అందరిని కలచి వేస్తున్నాయి.ఇక తాజాగా తెలుగు లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది.

 Jr Ntr Emotional Pay Tribute To Sirivennela Sitarama Sastry Details , Aravinda S-TeluguStop.com

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు.ఈయన మరణంతో ప్రముఖులు దిగ్బ్రాంతి చెందారు.

ఇక ఈ రోజు ఆయనకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ, అభిమానులు అందరు నివాళులు అర్పించారు.అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు.

ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్ధివదేహానికి ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.కొద్దిసేపు ఆయన సిరివెన్నెల పార్ధివదేహాన్ని చూస్తూ తన బాధను అణచి పెట్టుకున్నారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆయనను గుర్తు చేసుకుంటూ కొద్దిసేపు మాట్లాడారు.

”కొన్ని కొన్నిసార్లు మన బాధను ఎలా వ్యక్తపరచాలో మనకు తెలియదు.అలాంటి భావాలను అలాంటి మహానుభావుడే తన కలంతో సమాధానం చెప్పాలి.

Telugu Jr Ntr, Jrntrpay, Ntr, Lyric Writer, Rrr, Tollywood-Movie

నా ఆవేదనను కూడా ఆయన కలంతోనే చెప్పివుంటే బాగుండేది.ఆయన కలం ఆగినా కూడా మన తెలుగు భాష బ్రతికి ఉన్నంత కాలం ఆయన రాసిన పాటలు, సాహిత్యం, మాటలు అన్ని కూడా చిరస్మరణీయంగా అలాగే ఉంటాయి అని ఆయన తెలిపాడు.

Telugu Jr Ntr, Jrntrpay, Ntr, Lyric Writer, Rrr, Tollywood-Movie

ఇక రాబోయే తరానికి కూడా ఆయన సాహిత్యం బంగారు బాట వెయ్యాలి.ఆయన చల్లని చూపు ఎల్లప్పుడూ తెలుగు సాహిత్యం మీద ఉండాలి అని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు ఎన్టీఆర్.ఇక ఎన్టీఆర్ పలు సినిమాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాసారు.

అందులో ”అనగనగా.అరవిందట తన పేరు” అనే రీసెంట్ హిట్ పాట కూడా ఉంది.

ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.ప్రెజెంట్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా జనవరి 7న విడుదల కాబోతుంది.ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమా చేయబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube