చిరు, వెంకీ, నాగార్జున సినిమా ఎందుకు ఆగిపోయింది.. దాని వెనుక కారణం ఏంటి?

ఒక సినిమాకు ఒక స్టార్ హీరో మాత్రమే ఉంటాడన్న విషయం మనందరికీ తెలుసు.కానీ ఒకటే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉంటే ఆ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Why Chiru Venkatesh Nagarjuna Movie Stopped What Is The Reasons Behind It Detail-TeluguStop.com

ఇక ముగ్గురు స్టార్ హీరోలు ఉంటే మాత్రం సినిమా విడుదల కాక ముందుకే సూపర్ హిట్ అని చెప్పవచ్చు.నిజానికి స్టార్ హీరోల కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు చూసే ఎదురు చూపులు అంతా ఇంతా కాదు.

ఎందుకంటే ముగ్గురు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే అద్భుతంగా ఉంటుంది.అలా ఇప్పటివరకు స్టార్ హీరోల కాంబినేషన్ లలో కొన్ని సినిమాలు తెరకెక్కి మంచి సక్సెస్ ను అందుకున్నాయి.

ఇదిలా ఉంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ల హవా తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ హవా ప్రారంభమైంది.

ఈ నలుగురు ఒకే సమయంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోలుగా ఎదిగారు.

మంచి మంచి సూపర్ హిట్ సినిమాలలో నటించారు.ఇక ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఈ నలుగురు స్టార్ హీరోలు.

పైగా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు.

Telugu Chiranjeevi, Rajeev Roy, Heroes, Stoped, Nagarjuna, Stars, Tollywood, Tri

ఇక వీరికి తెలుగు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.వీరి కాంబినేషన్ లో సినిమాలు రావాలని ఎంతోమంది అభిమానులు ఆశగా ఎదురు చూశారు.కానీ కోరిక మాత్రం కోరిక గానే మిగిలిపోయింది.

ఎందుకంటే వీరి కాంబినేషన్ లో ఏ దర్శకుడికి సినిమా చేయడం సాధ్యం కాలేకపోయింది.కానీ గతంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా ఓ సినిమా చేయాలని అనుకున్నారట దర్శక నిర్మాతలు.

Telugu Chiranjeevi, Rajeev Roy, Heroes, Stoped, Nagarjuna, Stars, Tollywood, Tri

కానీ ఏం జరిగిందో తెలియదు ఈ సినిమా ఆగిపోయిందట.అప్పటికే ఆ సమయంలో బాలీవుడ్ లో ముగ్గురు స్టార్ హీరోల కాంబినేషన్ లో చాలా సినిమాలు తెరకెక్కాయి.అందులో 1989లో విడుదలైన త్రిదేవ్ సినిమా మాత్రం మంచి సక్సెస్ అందుకుంది.ఇందులో సన్నీడియోల్, జాకీ ష్రోప్, నసిరుద్దీన్ షా నటించారు.ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Telugu Chiranjeevi, Rajeev Roy, Heroes, Stoped, Nagarjuna, Stars, Tollywood, Tri

అయితే ఈ సినిమానే తెలుగులో రీమేక్ గా చిరు, వెంకీ, నాగార్జున కాంబినేషన్ లో తీస్తే మంచి సక్సెస్ అందుకుంటుందని కొందరు దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారట.దీంతో దర్శకుడు రాజీవ్ రాయ్ కూడా అభిమానులకు ఈ విషయం తెలియజేసాడట.కానీ ఈ సినిమాలతో సాహసం చేయలేకపోయారట.

ఆ తర్వాత ఈ సినిమా రీమేక్ ను నక్షత్ర పోరాటం పేరుతో రీమేక్ చేశారు.

అందులో సుమన్, భానుచందర్, అరుణ్ పాండ్యన్ నటించగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

కానీ వీరి స్థానంలో ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఉండి ఈ కథలో కొన్ని మార్పులు చేస్తే మాత్రం సినిమా పక్కా హిట్ అయ్యేదని అప్పట్లో టాక్ వచ్చింది.ఇక ఇప్పటికి అభిమానులు మాత్రం ఈ స్టార్ హీరోల కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారనే చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube