లైకా ప్రొడక్షన్స్ లో హీరోగా కమెడీయన్ యోగిబాబు.. కాకపోతే అలా?

ప్రస్తుత కాలంలో ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా మరి వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయట పెడుతున్నారు.ఇప్పటికే ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా పూర్తిస్థాయి చిత్రాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.

 Comedian Yogibabu As A Hero In Leica Productions Comedian, Yogibabu, Film Indust-TeluguStop.com

ఈ క్రమంలోనే మరొక కమెడియన్ యోగిబాబు కూడా మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అనుశరణ్‌ దర్శకత్వంలో యోగి బాబు హీరోగా లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నటువంటి చిత్రం ‘పన్నికుట్టి’.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం లైకా ప్రొడక్షన్‌తో కలిసి 11:11 ప్రొడక్షన్స్‌ తమిళ నాడు, కేరళ రాష్ట్రాల్లో విడుదల చేయనుంది.

ఈ సందర్భంగా సహ నిర్మాత శృతి తిలక్‌ మాట్లాడుతూ.

ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తమిళ కన్నడ భాషలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చే విధంగా పూర్తిస్థాయిలో హాస్యాస్పద భరితంగా ఉండబోతుందని ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుందని ఆయన తెలిపారు.

Telugu Leica, Yogibabu-Movie

ఈ విధమైనటువంటి పూర్తి స్థాయి హాస్యాస్పదమైన చిత్రాన్ని తెరకెక్కించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.కరుణాకరన్‌, దిండిగల్‌ లియోనీ, ‘సింగం’ పులి, విజయ్‌ టీవీ ఫేం రామర్‌, తంగదురై వంటి తదితరులు నటించారు.త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తుంది.ఇక ఇందులో యోగిబాబు ఎంతో అద్భుతంగా నటించారని ఆయన పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube