ఎన్నారైలకు గుడ్ న్యూస్.. ఇకపై మీ పిల్లల....

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE ) ఎన్నారైలకు గుడ్ న్యూస్ ప్రకటించింది.ఎలాంటి నిభందనలు లేకుండానే ఎన్నారైలు తమ పిల్లలను CBSE అనుభంద స్కూల్స్ లో చేర్చవచ్చునని కీలక ప్రకటన చేసింది.

 Cbse Good News For Nri Students , Cbse, Central Board Of School Education, India-TeluguStop.com

ఈ ప్రకటన ఎంతో మంది ఎన్నారై తల్లి తండ్రులకు ఊరట నిస్తుందని తెలిపింది.ఎన్నారైలు వివిధ దేశాలలో ఉండగా CBSE వారి చదువులకు వెసులు బాటు ఇవ్వడం ఏంటి అనే సందేహం రాక మానదు.

వివరాలలోకి వెళ్తే.

భారత్ నుంచీ వివిధ దేశాలకు ఎన్నారైలు వెళ్ళినా వారి వారి ఆర్ధిక పరమైన పరిస్థితుల కారణంగానో లేదంటే భారత దేశ సంస్కృతీ సాంప్రదాయా లకు అనుగుణంగా వారిని తీర్చి దిద్దాలనే కోరిక కారణంగానో ఎంతో మంది భారత ఎన్నారైలు తమ పిల్లలను భారత్ లోనే చదివిస్తూ ఉంటారు.

ముఖ్యంగా భారత CBSE విద్యా విధానంపైనే ఎన్నారైలు ఎక్కువగా మొగ్గు చూపుతారు.దాంతో CBSE విధానానికి అనుగుణంగా అనుభంద స్కూల్ లో వారి పిల్లలను చేర్చుతారు.

అయితే గతంలో CBSE నిభంధనల ప్రకారం భారత్ లోని స్కూల్ లో అడ్మిషన్లు పొందాలంటే వారు వలస వెళ్ళిన దేశాలలో CBSE కి సమానంగా ఉన్న స్కూల్స్ లో చదువుతూ ఉండాలి.అందుకు సంబంధించిన ఆధారాలు ఇక్కడి అప్లికేషన్ కు జతచేయాల్సి ఉంటుంది.

వాటిని పరిశీలించి తుది నిర్ణయం వెల్లడించిన తరువాత మాత్రమే ఎన్నారై పిల్లలకు అడ్మిషన్లు అందిస్తారు.కాగా కరోనా కారణంగా ఆర్ధిక పరిస్థితులు మరింత కఠినమైన తరుణంలో ఇక్కడే తమ పిల్లలను చదివించాలనే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో CBSE నిభందనలు వారికి అడ్డుగా మారాయి.ఈ తరుణంలో CBSE నిభందనలు సడలించింది.

ఎన్నారైలు ఇక్కడి స్కూల్ లో తమ పిల్లలను చేర్చాలంటే ముందస్తుగా ఎలాంటి అప్రూవల్ లేకుండానే చేరవచ్చునని, అయితే విద్యార్ధిని చేర్చుకునే స్కూల్స్ తప్పనిసరిగా విద్యార్ధి ప్రతిభను ఆధారంగా చేసుకుని అడ్మిషన్లు ఇచ్చుకోవచ్చునని స్కూల్ మీదనే భారం పెట్టింది.

ఈ తాజా నిర్ణయంతో ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube