అమెరికాలో తెలుగువారి హవా...ఇండో అమెరికన్ సర్వే ఏం చెప్పిందంటే...

అగ్ర రాజ్యం అమెరికాకు ప్రపంచ దేశాల నుంచీ వలసలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ముఖ్యంగా భారత్ నుంచీ ఈ వలసలు ఎక్కువగా ఉంటాయి.

 What The Indo-american Survey Said  , India, America, Kerala, Gujarat, Indian A-TeluguStop.com

అయితే భారత్ నుంచీ అమెరికాకు వలసలు ఎక్కువగా వెళ్ళే రాష్ట్రాలు ఏమయ్యి ఉంటాయి.ఇదే అంశంపై ఓ సంస్థ చేపట్టిన సర్వేలో షాకింగ్ నిజాలు బయట పడ్డాయి.

అమెరికాకు భారత్ వలసలు వెళ్ళే వారిలో అత్యధికంగా తెలుగు వారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్నారట.

అమెరికా వెళ్ళే వారిలో ఎక్కువగా కేరళా, గుజారాత్ వంటి రాష్ట్రాలే ముందు వరసలో ఉండేవి కానీ తాజా పరిణామాల నేపధ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు ధీటుగా తెలుగు రాష్ట్రాల నుంచీ వలసలు వెళ్తున్నారని ఇండియన్ అమెరికన్ అటిట్యూడ్ అలాగే సోషల్ రియాలిటీస్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ పేరుతో కార్నేగే ఎండో మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంస్థ ఈ సర్వే చేపట్టింది.

సదరు సర్వే లెక్కల ప్రకారం అమెరికాలో ఎక్కువగా భారత్ నుంచీ వెళ్ళిన వారిలో గుజరాతీయులు ప్రధమ స్థానంలో ఉన్నారట.గుజరాతీయులలో సుమారు 14 శాతం మంది ఉండగా, 12 శాతం తో మహారాష్ట్ర వాసులు అమెరికాలో ఉన్నారు.

కాగా తెలుగువారి సంఖ్య 10 శాతం ఉందట.మొదటి స్థానంలో గుజరాత్ ఉన్నా సరే వారికి ధీటుగా తెలుగు వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని సర్వే వెల్లడించింది.

అయితే ఈ 10 శాతం కేవలం ఏపీ రాష్ట్రం నుంచీ వచ్చిన వారు కావడం గమనార్హం, ఇదిలాఉంటే తెలంగాణా నుంచీ వెళ్ళిన వారు 4 శాతం కంటే ఎక్కువగా ఉన్నారని దాంతో తెలంగాణా రాష్ట్రాన్ని కుడా లెక్కిస్తే మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ ను బీట్ చే మరీ రెండు తెలుగు రాష్ట్రాల వారు మొదటి స్థానానికి చేరుకుంటారని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube