కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి.. కారణం అదే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.

 Chiranjeevi Wishes Niharika What Is The Reason Details, Chiranjeevi , Tollywood-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.ఇలా ప్రత్యేకించి చిరంజీవి నిహారికకు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆమె మెగా కుటుంబానికి ఏదైనా శుభవార్త చెప్పిందా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

నిజానికి అలాంటి శుభవార్త ఏమీ లేదని చెప్పాలి.పెళ్లికి ముందు నిహారిక బుల్లితెర యాంకర్ గా హీరోయిన్ గా సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.పెళ్లి అనంతరం ఈమె సినిమాలలో నటించడం లేదు.అందుకు గల కారణం తన భర్త చైతన్యకు తన సినిమాలలో నటించడం ఇష్టం లేదని ఈమె స్వయంగా వెల్లడించారు.

ఇక హీరోయిన్ గా నటించకపోయినా ఈమెకు సినిమాపై ఉన్న మక్కువ తగ్గకపోవడంతో నిర్మాతగా మారారు.

ఈ క్రమంలోనే నిహారిక నిర్మాతగా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు.

ఈ సిరీస్ నవంబర్ 19వ తేదీ జీ5 లో విడుదలయింది.సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా.పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై విడుదలైన ఈ వెబ్ సిరీస్ కు మహేష్ ఉప్పాలా దర్శకత్వం వహించారు.మన ఆర్థిక స్తోమత కన్నా అధిక మొత్తంలో బ్యాంకులో తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనే అంశంపై ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు.

ఇకపోతే 19వ తేదీ విడుదలైన ఈ వెబ్ సిరీస్ విశేష ఆదరణ దక్కించుకుంది.తాజాగా ఈ వెబ్ సిరీస్ మెగాస్టార్ చిరంజీవి చూశారు.ఈ సందర్భంగా చిరు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ చూశాను ఎంతో వినోదాత్మక భరితంగా ఉంది.తన తొలి ప్రయత్నంలోనే ఇంత హృద్యంగా, వినోదాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మించిన కొణిదెల ఆడపడుచు నిహారికకు, టీం మెంబెర్స్ అభినందనలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

ఇకపోతే నవంబర్ 19వ తేదీ విడుదలైన ఈ సిరీస్ ఇప్పటివరకు ఏ సిరీస్ దక్కించుకొని ప్రేక్షకాదరణ దక్కించుకుందని జీ5 వెల్లడించింది.ఇక మెగాస్టార్ తన వెబ్ సిరీస్ గురించి ఇలా ట్వీట్ చేయడంతో మెగా డాటర్ ఆనందానికి అవధులు లేవు అని చెప్పవచ్చు.ఇక మెగాస్టార్ విషయానికొస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఇక తను నటించిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీ విడుదలకు సిద్ధమైంది.అదేవిధంగా మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube