సకల సౌకర్యాలతో లభించే ఈ అపార్ట్‌మెంట్ ధర కేవలం 65 రూపాయలే..!

ప్రపంచంలో అతి తక్కువ విస్తీర్ణం కలిగిన దేశాల్లో జపాన్ కూడా ఒకటి.అందుకే ఇక్కడ ఇళ్లను చాలా ఇరుకుగా ఉండే చిన్న ప్రదేశాల్లోనే కట్టేస్తుంటారు.ప్రస్తుతం ఏ దేశంలోనైనా ఒక అపార్ట్‌మెంట్ లేదా ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే కనీసం నెలకు రూ.5-10 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది.కానీ జపాన్ లోని టోక్యోలో మాత్రం కేవలం రూ.65కే ఒక అపార్ట్‌మెంట్ ను అద్దెకు తీసుకోవచ్చు.అయితే మన భారతదేశంలో లాగా ఈ అపార్ట్‌మెంట్ చాలా పెద్దగా, విశాలంగా ఏముండదు.చిన్నగానే ఉంటుంది కానీ ఇందులో అన్ని సదుపాయాలు అందిస్తారు.

 Available With All Amenities, This Apartment Is Priced At Just Rs 65, Apartment-TeluguStop.com

ఆ అపార్ట్‌మెంట్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

స్వీడన్‌కి చెందిన ఫర్నిచర్ విక్రేత ఐకియా జపాన్‌ రాజధాని టోక్యోలో ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ని తాజాగా కొనుగోలు చేసింది.

ఆ అపార్ట్‌మెంట్‌ షింజుకు జిల్లాలోని 107 చదరపు అడుగుల్లో ఉంది.ప్రజలు దీన్ని నెలకు 99 యెన్లు (రూ.65)తో రెంట్ కి తీసుకోవచ్చు.ఇంత చిన్న అపార్ట్‌మెంట్‌లో ప్రజలు నివసించగలరా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఐకియా చాలా తక్కువ ధరకే అపార్ట్‌మెంట్‌ని అద్దెకి ఆఫర్ చేస్తోంది.

అయితే ఈ అపార్ట్‌మెంట్‌లో కావలసిన ఫర్నిచర్ మొత్తాన్ని ఏర్పాటు చేసింది.అలాగే అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్ తో దీనిని అందమైన అపార్ట్ మెంట్ గా తీర్చిదిద్దింది.ఆ అపార్ట్‌మెంట్‌లో కిచెన్ గది, టాయిలెట్, బెడ్ రూమ్ ఉంటాయి.అలాగే వాషింగ్ మెషిన్, ఫ్రిజ్, ఫోల్డబుల్ టేబుల్, షెల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కూడా ఉంటాయి.

అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటనలు టోక్యోతో పాటు జపాన్ అంతటా విస్తరించాయి.మరి ఈ చిట్టి ఇల్లును ఎవరి సొంతం చేసుకుంటారో చూడాలి.అయితే ఇంటిని అద్దెకు తీసుకోదలుచుకున్నవారికి 20 ఏళ్లు నిండి ఉండాలి.వారు డిసెంబర్ 3 లోపు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

అంతేకాదు ఎక్కువ కాలం రెంటుకు ఉండగల అద్దెదారుల దరఖాస్తులను మాత్రమే ఐకియా అంగీకరిస్తోంది.సెలెక్ట్ అయిన అద్దె దారులు ఈ అపార్ట్‌మెంట్‌ను 2023, జనవరి 15 వరకు లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ వంటి బిల్లులు అద్దెదారులే కట్టుకోవాల్సి ఉంటుంది.ఇది చిన్న అపార్ట్‌మెంట్‌యే అయినా ప్రజలు నివసించడానికి చాలా సౌకర్యవంతం గానే ఉంటుందని ఐకియా చెబుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube