తన స్పెషాలిటీని చాటుకున్న ద్రవిడ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా కోచ్‌ రాహుల్ ద్రవిడ్ తనదైన శైలిలో తన అభిమానులను ఎప్పుడూ ఫిదా చేస్తూనే ఉంటారు.తాజాగా మరోసారి తన ప్రత్యేకత ఏంటో చాటుకుని అందరినీ ఆకట్టుకుంటున్నారు.

 Rahul Dravid, Latest News, Viral Latest, Viral News, Sports Update-TeluguStop.com

కొద్ది గంటల క్రితమే కాన్పూర్‌ వేదికగా టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ముగిసిన సంగతి తెలిసిందే.అయితే ద్రవిడ్ ఈ గేమ్ కోసం పిచ్‌ని చాలా ప్రత్యేకంగా తయారు చేయించి వావ్ అనిపించారు.

సాధారణంగా ఆతిథ్య దేశాలు టెస్ట్ క్రికెట్ లో స్వదేశీ జట్టు కోసం పిచ్‌ని అనుకూలంగా తయారు చేస్తాయి.కానీ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ జట్టుకి కూడా అనుకూలించేలా పిచ్‌ని రెడీ చేశారు రాహుల్ ద్రవిడ్.ఇరుజట్లకు, బౌలర్లకు, స్పిన్నర్లకు, బ్యాట్స్‌మెన్లకు అనుకూలించేలా పిచ్ సిద్ధం చేసిన గ్రీన్‌ పార్క్‌ స్టేడియం సిబ్బందికి రూ.35 వేలు సాయం కూడా చేశారు.

అయితే ఈ విషయాన్ని రాహుల్ ఎవరికీ చెప్పలేదు.కానీ మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ రాహుల్ ద్రవిడ్ పిచ్ కోసం తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తల గురించి అధికారికంగా వెల్లడించింది.

ఈ పిచ్ పై జరిగిన తొలి టెస్టులో భారత జట్టు విజయం సాధిస్తుందని అందరూ భావించారు కానీ న్యూజిలాండ్ నిలకడగా నిలబడింది.దాంతో ఈ మ్యాచ్ కాస్త డ్రాగా ముగిసింది.

అజాజ్‌ పటేల్ (2), రచిన్‌ రవీంద్ర (18) జట్టు మరో వికెట్ కోల్పోకుండా ఏకంగా 50 కంటే ఎక్కువ బంతులను డిఫెన్స్ చేసేసారు.దాంతో మన భారత జట్టు ఒక వికెట్ తేడాతో గెలుపుకు దూరమైపోయింది.

Telugu Latest, Rahul Dravid-Latest News - Telugu

నిజానికి గతంలో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లు చాలా రోజుల పాటు కొనసాగేవి కానీ ఇప్పుడు నాలుగు రోజులకు మించి టెస్టు మ్యాచులు జరగడం లేదు.అయితే సొంత జట్టుకి అనుకూలంగా పిచ్‌ని సిద్ధం చేసి విజయం సాధించడం సరైనది కాదని భావించిన ద్రవిడ్‌.ఇలా తొలిసారిగా పిచ్‌ని అందరికీ సమానంగా అనుకూలించేలా రెడీ చేయించారు.ఇప్పటివరకు ఏ క్రికెట్ కోచ్ కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు.దాంతో ద్రవిడ్‌ ని విశ్లేషకులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.మిగతా కోచ్ లకు, ద్రవిడ్‌ కి మధ్య తేడా ఇదే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.

ఈ పిచ్‌పై శ్రేయస్‌ అయ్యర్‌, టామ్ లేథమ్‌ తదితర బ్యాటర్లతో సహా టిమ్ సౌథీ, కైల్‌ జేమీసన్‌ వంటి విదేశీ బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు.ఇందుకు కారణం రాహుల్ ద్రవిడ్ పిచ్ ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దటమే!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube