ఆ చెట్టును చూడటానికి తరలి వస్తున్న వేలాది మంది.. దాని ప్రత్యేకత తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు!

సాధారణంగా కాలనుగుణంగా చెట్లు తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి.భారతదేశంలో ఆరు రకాల కాలాలు ఉంటాయి.

 1400 Years Old Gingko Tree In China Attracting Everyone What Are Its Specialties-TeluguStop.com

వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు (ఎండాకాలం), వర్షఋతువు, శరదృతువు, హేమంత ఋతువు (చలికాలం), శిశిరఋతువు ఇలా భారతదేశంలోని వివిధ కాలాల ప్రకారం చెట్లు ఆకు రాల్చడం, చిగురించడం, ఎండి పోవడం జరుగుతుంది.చైనా దేశంలో కూడా అన్ని రకాల కాలాలు ఉంటాయి.

సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు చైనాలో శరదృతువు కొనసాగుతుంది.

ఈ సమయంలో చెట్లు ఆకులు రాల్చుతూ చూపరులకు కనువిందు చేస్తాయి.

ఈ మనోహరమైన దృశ్యాలు నేలపై ప్రతి సంవత్సరమూ ఆవిష్కృతమవుతాయి.ఆకులన్నీ నారింజ రంగులోకి మారిపోయి నేలపై సహజమైన పూలపాన్పును రూపొందిస్తాయి.

హాయిని గొలిపే ఈ సుందర దృశ్యాలను చూసేందుకు అందరూ ఇష్టపడుతుంటారు.

అయితే సాధారణంగా ఏ చెట్లనైనా ఫ్రీగా చూసి వాటి అందాలను ఆస్వాదించవచ్చు.

కానీ చైనాలో శరదృతువులో ఒక చెట్టును చూడాలంటే బస్సు, రైలు, విమాన టిక్కెట్లు రిజర్వు చేసుకున్నట్టుగా రిజర్వేషన్ చూసుకోవాలి.అవాక్కయ్యారు కదా! ఆ చెట్టు ప్రత్యేకత అలాంటిది మరి! చైనా దేశంలోని గునియిన్‌ గుమియావో టెంపుల్ మధ్యలో ఉండే ఈ చెట్టు అందరికీ ముచ్చటగొలుపుతుంది.

ముఖ్యంగా ఇది శరదృతువులో ఆకులు రాల్చుతూ అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తుంది.

చైనాటౌన్‌లోని షాంగ్జీ ప్రావిన్స్‌లోని జోంగ్‌నాన్‌ పర్వతాల ప్రాంతంలో గునియిన్‌ గుమియవో అనే బౌద్ధుల ఆలయం ఉంది.ఆ ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో బాగా పేరుగాంచిన వాటిలో గునియిన్‌ గుమియవో ఆలయం ఒకటి.అయితే ఈ ఆలయం కంటే ఈ ఆలయంలో ఉన్న గింగ్‌కొ బిలోబా అనే చెట్టే ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా దీని సోయగాలను చూసేందుకు లక్షల తరబడి పర్యాటకులు వస్తారంటే అతిశయోక్తి కాదు.

ఈ చెట్టు ప్రత్యేకత తెలుసుకుంటే.ఈ చెట్టు ఇప్పుడు పుట్టింది కాదు.అక్షరాల 1400 తరాల క్రితం పుట్టిన ఈ చెట్టు ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం విశేషం.618-907 కాలంలో టాంగ్‌ రాజ్యాన్ని పాలించిన లి షిమిన్‌ ఈ చెట్టును నాటినట్టు చరిత్ర చెబుతోంది.అయితే ఈ చెట్టు వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీగా గుర్తింపు కూడా పొందింది.

మామూలు కాలాల్లో ఇది ఆకుపచ్చ ఆకులతో సాధారణంగానే కనిపిస్తుంది.కానీ చలికాలం మొదలై శరదృతువులోకి అడుగుపెట్టగానే ఇది అత్యంత రమణీయంగా మారుతుంది.

ఈ చెట్టు ఆకులు శరదృతువులో బంగారువర్ణంలోకి మారి రాలిపోతాయి.ఆ ఆకులన్నీ నేలపై పడి ఒక అందమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి.

ఈ చెట్టు కింద ఉండే నేలంతా బంగారం రంగులో కాంతులీనుతుంది.

ఆ దృశ్యాన్ని చూస్తే పుడమి తల్లికి బంగారు వర్ణ చీర కట్టినట్టు అనిపిస్తుంది.ఇలాంటి ప్రకృతి సుందరమైన చెట్టుని ప్రతి శరదృతువు ప్రారంభంలో స్థానికులు వచ్చి చూసేవారు.అయితే దీని అందాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ప్రపంచం నలుమూలల నుంచి రోజుకి వేలల్లో పర్యాటకులు వస్తున్నారు.

అక్టోబర్‌ నెల నుంచి డిసెంబర్‌ మొదటివారం వరకు కనీసం 60వేల మంది టూరిస్టులు ఈ చెట్టును వీక్షించేందుకు పోటెత్తుతారు.టూరిస్టులు రద్దీని కంట్రోల్ చేసేందుకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ స్టార్ట్ చేశారు ఆలయ నిర్వాహకులు.

అలా రిజర్వేషన్‌ చేసుకున్న టూరిస్టులు.కనీసం నాలుగు గంటలు క్యూలో నిలబడితే ఆ చెట్టు దర్శన భాగ్యం వరిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube