కేసీఆర్ చేసిన కామెంట్లు ఆయ‌న్నే ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయా..?

ఢిల్లికి పోయి తాడో పేడో తేల్చుకుంటామ‌ని చెప్పిన సీఎం కేసీఆర్‌.చివ‌ర‌కు ఉసూరుమ‌నిపించారు.

 Are The Comments Made By Kcr In The Same Conflict Details, Kcr, Ts Poltics, Kcr-TeluguStop.com

ఆయ‌న ఢిల్లీకి వెళ్లినా మంత్రుల‌ను మాత్ర‌మే కేంద్ర‌మంత్రుల వ‌ద్ద‌కు పంపారు కానీ ఆయ‌న మాత్రం వెళ్ల‌లేదు.అయితే ఢిల్లీ నుంచి వ‌చ్చిన త‌ర్వాత రెండు రోజుల్లోనే ఏ పంట‌లు వేసుకోవాలో చెప్తామ‌ని చెప్పిన కేసీఆర్ నాలుగు రోజుల వ‌ర‌కు సైలెంట్ గానే ఉండిపోయారు.

అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.అయితే ఆయ‌న మాట‌లు వింటే మాత్రం కొన్ని సందేహాలు రాక మాన‌వు.

సాధార‌ణంగా కేసీఆర్ మంచి మాట‌కారి.ఆయన‌కు లాభం చేకూరుతుంది అనుకుంటే ఒక ర‌కంగా.న‌ష్టం వ‌స్తుంది అనుకుంటే మాత్రం ఇంకో ర‌కంగా మాట్లాడ‌టం ఆయ‌న‌కు మొద‌టి నుంచే అల‌వాటు.అయితే ఇప్పుడు వ‌డ్ల కొనుగోలు విష‌యంలో కూడా త‌న‌దేం లేద‌న్న‌ట్టు, మొత్తం కేంద్ర ప్ర‌భుత్వ‌మే చేస్తోందన్న‌ట్టు చెప్పేశారు.

బీజేపీ ప్ర‌భుత్వం చేప‌డుతున్న విధానాల‌న్నింటినీ విమ‌ర్శించేశారు.కాగా తాము యాసంగి పంట‌ను కొనుమ‌ని కోరితే కేంద్రం కొన‌ట్లేద‌ని, త‌మ ప్ర‌భుత్వం మెడ మీద క‌త్తి పెట్టి మ‌రీ లెట‌ర్ రాయించుకుంద‌ని చెప్పేశారు.

Telugu Bjp, Central, Cm Kcr, Farmers Issus, Grains, Kcr, Kcr Delhi, Ts Poltics,

ఈ విష‌య‌మే అంద‌రినీ షాక్ కు గురి చేసింది.ఎందుకంటే కేసీఆర్ ఏమ‌న్నా ప్ర‌తిప‌క్షంలో ఉన్న వ్య‌క్తి కాదు క‌దా.ఏకంగా సీఎం కుర్చీలో ఉన్న వ్య‌క్తి.అలాంటి ప‌వ ర్ ఉన్న సీఎం కేసీఆర్ వారు ఇవ్వ‌మంటే ఎందుకు ఇచ్చారు.రేపు అధికారం ఇవ్వ‌మంటే ఇచ్చేస్తారా అన్న‌ది చాలామంది లేవ‌నెత్తుతున్న ప్ర‌శ్న‌లు.మ‌రి అప్పుడు లెట‌ర్ రాస్తే అప్పుడే కేసీఆర్ ఎందుకు చెప్ప‌లేదు.

ఇన్ని రోజ‌లు ఎందుకు సైలెంట్ గా ఉన్నార‌నేది చాలా ర‌కాలుగా వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు.ఇవే ఆయ‌న మీద విమ‌ర్శ‌లు తెచ్చే విధంగా ఉంటున్నాయి.

మ‌రి కేసీఆర్ మున్ముందు ఇంకేం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube