ఏపీలో ఇంకా రంగంలోకి దిగ‌ని పీకే టీమ్.. కార‌ణాలు ఇవేనా..?

2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అంతటి భారీ మెజార్టీతో గెలిచారంటే అందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి.మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే అంద‌రి కంటే ముందు గుర్తుక వ‌చ్చే పేరు ప్ర‌శాంత్ కిషోర్‌.

 Pk Team Not Yet In The Field In Ap What Are The Reasons , Pk Team, Jagan-TeluguStop.com

ఆయ‌న వ్యూహాలు జ‌గ‌న్ ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాయి.ఏ పార్టీకి దక్క‌నంత భారీ మెజార్టీని క‌ట్ట‌బెట్టాయి.

ఈ విజ‌యంతో దేశ రాజకీయాల్లో ఇటు జ‌గ‌న్‌, అటు ప్ర‌శాంత్ కిషోర్ హాట్ టాపిక్ అయిపోయారు.ఈ ఇద్ద‌రూ సాగించిన హ‌వాకు చంద్ర‌బాబు పార్టీ కొట్టుకుపోయింది.

ఏకంగా నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిందంటే మామూలు విష‌యం కాదు.

అయితే ఇదే న‌మ్మ‌కంతో ఆయ‌న్ను మ‌రోసారి రంగంలోకి దింపేందుకు జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నారు.

కానీ ఇప్ప‌టికీ న‌వంబరు నెల వ‌చ్చినా స‌రే పీకే టీం మాత్రం ఏపీలో అడుగు పెట్ట‌లేదు.దాదాపు రెండున్న‌రేండ్లు గ‌డుస్తున్నా కూడా పీకే రాక‌పోవ‌డం ఏంట‌ని చాలామంది ఆలోచిస్తున్నారంట‌.

కానీ ఒక‌వైపు వైసీపీలో చూస్తే గ‌తం కంటే ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయి.ఇప్పుడు అధికార పార్టీ కావ‌డంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు వ‌ర్గాలు ఉంటున్నాయి.

ఇప్పుడు పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చే ప‌రిస్థితులు లేవు.

Telugu Ap, Jagan, Pk, Pk Field Ap-Telugu Political News

ఒక‌వేళ అలా మారిస్తే గ‌న‌క పార్టీ మ‌రింత వీక్ అయిపోతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారంట.పెద్ద ఎత్తున నేత‌లు తిరగుబాటు దారులుగా మారుతార‌ని కాబ‌ట్టి వారంద‌రినీ కాపాడుకోవాలంటే ఇప్పుడు పీకే టీమ్ ను రంగంలోకి దింప‌డం అన‌వ‌స‌రం అని భావిస్తున్నారంట‌.ఎందుకంటే పీకే టీం వ‌చ్చి ఇప్పుడు స‌ర్వే చేస్తే పెద్ద‌గా ఉప‌యోగం ఏమీ ఉండ‌ద‌ని, కాబ‌ట్టి చివ‌రి ఏడాదిలో స‌ర్వే చేస్తే ఎవ‌రి మీద అసంతృప్తి ఉందో తేలుతుంద‌ని, అప్పుడు స‌ర్వే రిపోర్టుల‌ను చూపించి వారిని ప‌క్క‌న పెట్టినా పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌బోద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారంట‌.

అందుకే ప్ర‌శాంత్ కిశోర్ ను ఇప్పట్లో రంగంలోకి దించ‌కుండా చివ‌రి ఏడాదిలోనే ర‌ప్పించాలని చూస్తున్నారంట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube