కోమటి రెడ్డి తగ్గినా తగ్గని జగ్గారెడ్డి.. అసలు కారణమిదేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కొరకై పెద్దఎత్తున బీజేపీకి కాంగ్రెస్ కు పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.

 Komati Reddy Is Less Or Less Jaggareddy .. What Is The Real Reason Revanth Reddy-TeluguStop.com

అయితే ప్రస్తుత పరిస్థితిలలో కాంగ్రెస్ కు మాత్రం ఇది కీలక సమయమని చెప్పవచ్చు.ఎందుకంటే వచ్చే రెండున్నర సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇటు పార్టీ క్యాడర్ ను సమాయత్తపరుస్తూనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వైపు ప్రజలను మళ్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది.

అయితే ఇవన్నీ రాజకీయాలలో సర్వ సాధారణమైనా కాంగ్రెస్ ను ముఖ్యంగా దెబ్బ తీస్తున్న అంశం అంతర్గత పోరు.అయితే గత తొమ్మిది సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రజల మద్దతు పొందకపోవడానికి ప్రధాన కారణం ఈ అంతర్గత పోరు అని కాంగ్రెస్ నేతలు ఎవరిని అడిగినా నిర్మొహమాటంగా చెప్తారు.

అయితే తాజాగా ఐక్యరాగంతో కొంత కాంగ్రెస్ కార్యకర్తలకు కొంత ఊరటనిచ్చినా ఇలా ఎంత కాలం కలసిమెలిసి ఉంటారనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది.అయితే కోమటిరెడ్డి వెంకట రెడ్డి దగ్గరయినా జగ్గారెడ్డి మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి ఉంది.

Telugu @revanth_anumula, Jagga, Jaggaredy, Komati Reddy, Telangana, Trs, Ts Cong

అవసరమైతే ఎమ్మెల్యేగా నా నియోజకవర్గానికి పరిమితమవుతా అంటూ వెనక్కి తగ్గేది లేదనే విధంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు.అయితే సీనియర్ కాంగ్రెస్ నేతగా నా స్థాయిని తగ్గించుకునే ప్రసక్తి లేదని సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.అయితే కాంగ్రెస్ పార్టీకి ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని కలసి పనిచేద్దామని నచ్చ జెప్పడానికి ప్రయత్నించినా జగ్గారెడ్డి మాత్రం ఏ మాత్రం అంగీకరించని పరిస్థితి ఉంది.ఏది ఏమయినా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తుందనేది చూడాల్సి ఉంది.

అయితే జగ్గారెడ్డి వ్యవహారం కూడా రానున్న రోజుల్లో సద్దుమనిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube