ట్విట్టర్ సీఈవో గా భారతీయుడు..!!

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవో పదవికి జాక్ డోర్సీ రాజీనామా చేశారు.సుమారు 16 ఏళ్ళ పాటు సుదీర్ఘ కాలం ట్విట్టర్ కు సిఈవో గా సేవలు అందించిన ఆయన తాను రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.

 Indian As Ceo Of Twitter  , Jack Dorsey As Ceo Of Twitter, Parag Agarwal, Techni-TeluguStop.com

ఈ మేరకు తన రాజీనామా లేఖను తన ట్విట్టర్ ఖాతా నుంచీ ట్వీట్ చేశారు.అయితే తదుపరి సీఈవో గా భాద్యతలు చేపట్టబోయే వ్యక్తి భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ గా నియమితులు అయ్యారని ప్రకటించారు.

భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ఎన్నో ఏళ్ళ క్రితమే అమెరికా వచ్చి స్థిరపడ్డారు.2011 లో ట్విట్టర్ లో చేరన ఆయన తన అత్యున్నతమైన ప్రతిభతో ట్విట్టర్ లో ఎన్నో పదవులు చేపట్టారు.గతంలో మైక్రోసాఫ్ట్ , యాహూ లలో కూడా పలు కీలక భాద్యతలు నిర్వహించారు.ఇదిలాఉంటే ట్విట్టర్ లో టెక్నికల్ స్ట్రాటజీ, మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కన్జ్యూమర్ అండ్ సైన్స్ వంటి పలు విభాగాలలో పనిచేస్తూ కీలక భాద్యతలు చేపట్టారు.

ఇదిలాఉంటే పరాగ్ అగర్వాల్ పుట్టి పెరిగింది అంతా ముంబై లోనే.అక్కడి బాంబే ఐఐటీ లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన ఆయన అమెరికాలోని కాలిఫోర్నియా స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో చదువుకుని డాక్టరేట్ పొందారు.

ఆ తరువాత మైక్రో సాఫ్ట్ వంతో ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తూ 2011 లో ట్విట్టర్ లో చేరారు.అప్పటి నుంచీ ఆయన వెనుదిరిగి చూడలేదు.

తాజాగా అంటే 2019 లో ట్విట్టర్ లోని ప్రాజెక్ట్ బ్లూ స్కూ అనే టీమ్ కు ఇంచార్జ్ గా నియమితులు అయ్యారు.ప్రస్తుతం జాక్ డోర్సీ సీఈవో భాద్యతల నుంచీ తప్పుకుంటూ పరాగ్ అగర్వాల్ ని నియమిస్తూ ఆయనకు తన మద్దతు ఉందంటూ ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube