వైర‌ల్ పిక్‌.. ఇది ఆసుప‌త్రా లేక చెరువా..

మ‌న దేశంలో వ‌ర‌లు వ‌చ్చాయంటే చాలు పెద్ద పెద్ద న‌గ‌రాలు కూడా నిండా నీట మునిగిపోతున్నాయి.రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయిపోతుంటాయి.

 Viral Pic   Whether It Is A Hospital Or A Pond .., Viral Pic, Floods, Viral , Ta-TeluguStop.com

ఆ రాష్ట్రం, ఈ సిటీ అనేతేడా ఏమీ లేదు.ఎక్క‌డ వ‌ర్షాలు ప‌డ్డా స‌రే పెద్ద పెద్ద న‌గ‌రాల్లో వ‌ర‌ద‌లు రావ‌డం చాలా కామ‌న్ అయిపోయింది.

రోడ్ల మీద వాహ‌నాలు కూడా వెళ్లేందుకు వీలుండ‌దు.ఇక లోత‌ట్టు ప్రాంతాల విష‌యం అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇండ్లు మొత్తం చెరువ‌లో ఉన్న‌ట్టు ఉంటుంది.వాళ్లు త‌మ ఇండ్లలోకి వెళ్లాలంటే కొన్ని నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది.

ఇప్పుడు తమిళనాడు, ఏపీలో విప‌రీత‌మైన వర్షాలు కురుస్తున్నాయి.దీంతో పెద్ద పెద్ద న‌గ‌రాలు మొత్తం నీట మునుగుతున్నాయి.ఇప్ప‌టికే చాలా న‌గ‌రాల్లో జ‌న‌జీవ‌నం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నిండా నీరే క‌నిపిస్తున్నాయి.

ఎటు చూసినా రోడ్ల మీద వ‌ర‌ద‌లు పారుతున్నాయి.ఇక వ‌ర‌ద‌ల దాటికి అన్ని ఏరియాల్లో ఇండ్ల‌లోకి నీరు వ‌చ్చిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ చెక్క‌ర్లు కొడుతున్నాయి.

అయితే ఇప్పుడు ఓ ఫొటో అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.ప్ర‌జ‌ల‌కు నిత్యం చికిత్స అందించే ఆస్ప‌త్రిలోనే నిండా నీరు ఉన్నాయి.

Telugu Andra Pradesh, Floods, Havey, Tamil Nadu-Latest News - Telugu

తమిళనాడులోని అన్ని ఆస్ప‌త్రులు, పోలీస్ స్టేష‌న్ల‌లో ఇప్పుడు వ‌ర‌ద నీరే క‌నిపిస్తోంది.అయితే ఇప్పుడు కాగా చెన్నై నుంచి తిరుత్తణి వెళ్లే దారిలో ఉన్న‌టువంటి కనకమ్మ సత్రం నిండా నీరే క‌నిపిస్తున్నాయి.ఈ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఎటు చూసినా వ‌ర‌ద నీళ్లే క‌నిపిస్తున్నాయి.ఈ వ‌ర‌ద నీటిలోనే రోగుల‌కు సేవ‌లు అందిస్తున్నారు సిబ్బంది.జ‌న‌ర‌ల్ వార్డు, పేషెంట్లు ఉండే ఇత‌ర వార్డుల్లోకి కూడా ఈ నీళ్లు రావ‌డంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.వ‌ర్షాల నేప‌థ్యంలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

ఈ ఫొటో ఎంత ద‌య‌నీయ ప‌రిస్థితులు ఉన్నాయో చూపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube