రాజ్యాంగ హ‌క్కుల‌తో వెడ్డింగ్ కార్డును ముద్రించిన యువ‌కుడు.. నెటిజ‌న్లు ఫిదా

ఒక్కోరిది ఒక్కో శైలి.అసలు కొంత మంది ఒకలా ఆలోచిస్తే మరికొంత మంది వేరేలా ఆలోచిస్తారు.

 The Young Man Who Printed The Wedding Card With Constitutional Rights Details,ne-TeluguStop.com

చాలా మంది చాలా నార్మల్ గా పెళ్లి పత్రికలను డిజైన్ చేయిస్తారని అనుకున్నాడో ఏమో ఓ వ్యక్తి తాను వెరైటీగా వెడ్డింగ్ కార్డును ప్రింట్ చేయించాడు.ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు ఆన్ లైన్ లో తెగ వైరల్ అవుతోంది.

అసోంలోని గౌహతికి చెందిన అడ్వకేట్ అజయ్ శర్మ చాలా వెరైటీగా ఆలోచించాడు.హరిద్వార్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్న పూజా శర్మ అనే యువతిని అజయ్ పెళ్లి చేసుకున్నారు.

స్వతహాగా న్యాయవాది అయిన అజయ్ తన వెడ్డింగ్ కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు.ప్రస్తుతం ఈ పత్రిక వైరల్ గా మారింది.

పెళ్లి పత్రిక అంటే ఎవరైనా సరే తమ పేర్లను ప్రింట్ చేయిస్తారు.కానీ అజయ్ వెరైటీగా రాజ్యంగాన్ని తన పెళ్లిపత్రికలో ప్రింట్ చేయించాడు.కార్డ్ ఓపెన్ చేయగానే న్యాయ దేవత చేతిలో త్రాసు మనకు కనిపిస్తుంది.ఇలా త్రాసుకు ఉన్న రెండు వైపులకు పెళ్లి కూతురు, మరియు పెళ్లి కొడుకు పేర్లను ప్రింట్ చేయించారు.

మన రాజ్యాంగంలో పెళ్లి చేసుకునేందుకు ఉన్న చట్టాలు, హక్కులను కూడా అచ్చేయించారు.ఆర్టికల్ 21 ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు భారతీయ పౌరులకు ఉంది.

ఇప్పుడు ఈ హక్కును మేము వాడుకునేందుకు సిద్ధమయ్యాం.

Telugu Advocateajay, Assam Guwahati, Netizens Praise, Pooja Sharma, Variety-Late

అని వెరైటీగా ఉండి చూసే వారిని తెగ ఆకట్టుకుంటోంది.హిందూ సంప్రదాయ చట్టం 1955 ప్రకారం వధూ వరుల పరస్పర అంగీకారంతో ఈ పెళ్లి జరుగుతున్నట్లు ప్రకటించారు.డిసెంబర్ 1 న వీరి రిసెప్షన్ జరగనుంది.

ఇక దీన్ని చూసిన నెటిజ‌న్లు ఎంతో ఆనందిస్తున్నారు.ఇలాంటి అవ‌గాహ‌న అంద‌రికీ ఉండాలంటూ కోరుతున్నారు.

కొత్త జంట‌కు అంద‌రూ కంగ్రాట్స్ చెబుతున్నారు.వెరైటీ పెళ్లి పత్రికను మీరూ ఓ సారి చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube