కొత్త టీమ్ ఏర్పాటులో రేవంత్ ? ఇక మామూలుగా ఉండదా ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు కాంగ్రెస్ పార్టీలో చేశారు.అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి పూర్తిగా కోల్పోయింది అనుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం టిఆర్ఎస్,  కేసీఆర్ ,కేటీఆర్ వ్యవహారాలపై రచ్చ చేయడం వారి అవినీతి వ్యవహారాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేయడం, రేవంత్ ను కట్టడి చేసేందుకు టీఆర్ఎస్ అధిష్టానం కూడా అనేక రకాలుగా ఆయనపై కేసులు నమోదు చేయించడం వంటి ఎన్నో వ్యవహారాలు నడిచాయి.

 Revanth Reddy, Pcc President, Telangana, Dcc Presidents, Bjp Congress, Bjp, Utta-TeluguStop.com

అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించింది ఈ విషయంలో ఎన్ని అభ్యంతరాలు వచ్చినా,  కాంగ్రెస్ అధిష్టానం లెక్కచేయకుండా,  రేవంత్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.ఇక అప్పటి నుంచి ఆయన తన మార్క్ కాంగ్రెస్ లో చూపిస్తూనే వస్తున్నారు.

అయితే తాను అనుకున్నంతగా మేర మిగతా నాయకులు దూసుకు వెళ్ళలేకపోతున్నారు అని,  టిఆర్ఎస్ పోరాటం చేసే విషయంలో కానీ,  ప్రజల్లో బలం పెంచుకునే విషయంలో కాని తగిన విధంగా వ్యవహరించడం లేదనే అసంతృప్తి ఉంది.

ముఖ్యంగా డిసిసి అధ్యక్షులు విషయంలో రేవంత్ కాస్త అసంతృప్తిగానే ఉన్నారు.

  ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో నియమితులైన వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు.  దీంతో వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.

Telugu Bjp Congress, Dcc, Pcc, Revanth Reddy, Telangana-Telugu Political News

 ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులను మార్చి వారి స్థానంలో యువ నాయకులను , ప్రజాబలం ఉన్న వారిని నియమించుకోవాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు ఎవరిని డిసిసి అధ్యక్షులు నియమించాలనే విషయంలో రేవంత్ రెడ్డి టీం రంగంలోకి దిగిందట.  కొత్త సంవత్సరం జనవరిలో కొత్త డిసిసి అధ్యక్షుల నియామకాన్ని చేపట్టి పార్టీని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహం లో రేవంత్ ఉన్నట్లు సమాచారం.రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ లో భారీ ప్రక్షాళన చేపట్టకపోతే తెలంగాణ లో అధికారం సాధించడం సాధ్యం అయ్యే పని కాదని ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ కి వచ్చినట్టు గా కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube