చివరి కోరిక తీరకుండా కన్ను మూసిన శివ శంకర్ మాస్టర్

శివ శంకర్ మాస్టర్. సినీ జగత్తులో ఆయన నటరాజుకి నిజ స్వరూపం అని చెప్పుకోవచ్చు.

 Shiva Shankar Master Last Wish Details, Shiva Shankar Master, Shiva Shankar Mast-TeluguStop.com

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో మాస్టర్ మొత్తం 800 చిత్రాలలో కొన్ని వేల పాటలకి డ్యాన్స్ కంపోజ్ చేశారు.ఎంతో మంది స్టార్ హీరోలు మాస్టర్ డ్యాన్స్ లతో మంచి పేరు తెచ్చుకున్నవారే.

ఇలాంటి లెజండ్రీ డ్యాన్స్ మాస్టర్ కరోనా కారణంగా కన్ను మూయడంతో ఇండస్ట్రీ అంతా శ్రోక సంద్రములో మునిగిపోయింది.ఈ నేపథ్యంలో మాస్టర్ కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మాస్టర్ చివరి కోరిక ఏమిటి? అది తీరిందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

శివ శంకర్ మాస్టర్ తన జీవిత కాలంలో కొన్నికోట్ల పైనే సంపాదించి ఉంటారు.

కానీ., చివరి రోజుల్లో ఆర్ధికంగా చితికిపోయారు.

హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ కావడంతో వైద్యానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది.కానీ.

, మాస్టర్ చివరి కోరిక డబ్బుకి సంబంధించినది కాదు.ఆయన చివరి కోరిక కూడా డ్యాన్స్ కి సంబంధించినదే కావడం గమనార్హం.

మాస్టర్ డ్యాన్సర్ గా బిజీగా ఉనన్ సమయంలో ఆయనకి అస్సలు సమయం ఉండేది కాదు.కానీ., సినిమాల్లో రాను రాను క్లాసికల్ సాంగ్స్ అవసరం తగ్గిపోయింది.

Telugu Classical Dance, Corona, Dance, Nataraju, Shivashankar, Tollywood-Movie

ఇదే సమయంలో మాస్టర్ కి వయసు అయిపోతూ వచ్చింది.ఈ కారణంగా మాస్టర్ డ్యాన్స్ కి దూరం అయిపోయారు.కానీ.

, బుల్లితెరపై డ్యాన్స్ షోలకి జడ్జ్ గా వచ్చి పేరు సంపాదించుకున్నారు.కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా మెరిశారు.

ఈ సందర్భంలోనే మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో తన చివరి కోరికని బయట పెట్టారు.

Telugu Classical Dance, Corona, Dance, Nataraju, Shivashankar, Tollywood-Movie

నాకు డబ్బు మీద, ఆస్తుల మీద వ్యామోహాలు లేవు.నాకు ఆ నటరాజు దయ వల్ల కళ అబ్బింది.ఆ కళని నా చావు తరువాత కూడా బతికించుకుంటే చాలు.

సెట్ లో డ్యాన్స్ చేస్తుండగానే నా ప్రాణం పోవాలి.డ్యాన్స్ లేకుండా నన్ను నేను ఉహించుకోలేను.

అదే నా చివరి కోరిక అని మాస్టర్ తెలియజేశారు.కానీ,, శివ శంకర్ మాస్టర్ చివరి రోజుల్లో ఆరోగ్యం అంతంగా సహకరించకుండా వచ్చింది.

ఆయన సినిమా సెట్ లో చివరి సారిగా అడుగు పెట్టింది ఆచార్య కోసమే.ఈ రకంగా చూసుకుంటే మాస్టర్ తన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు అనుకోవచ్చు.

చూశారు కదా? శివ శంకర్ మాస్టర్ మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube