నెలాఖరులోపే పర్సులు ఖాళీ..భారతీయ ఉద్యోగులపై ప్రభావం చూపుతున్న జీవన వ్యయం!

గత కొంతకాలంగా భారతదేశంలో జీవన వ్యయం లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరుగుతోంది.పెట్రోల్, డీజిల్, గ్యాస్ నుంచి నిత్యావసర సరుకుల ధరల వరకు ప్రతి ఒక్కటి భగ్గుమంటోంది.

 Wallets Empty By The End Of The Month Cost Of Living Affecting Indian Employees-TeluguStop.com

దీనితో వేతన జీవులపై మరింత భారం పడుతోంది.చాలా మంది ప్రజలకు ఆర్థిక క్రమశిక్షణ లేక అప్పులపాలవుతున్నారు.

పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ జీతాన్ని ఖర్చు పెట్టలేక నెలాఖరులోపే తమ పర్సులు ఖాళీ చేసుకుంటున్నారు.మళ్ళీ జీతం వచ్చే ఒకటో తారీఖు కోసం నెలంతా ఎదురు చూస్తున్నారు.

తీరా ఒకటో తారీఖు రాగానే చేతికందిన జీతం రెండు మూడు రోజుల్లోనే ఆవిరైపోతుంది.ఇదే విషయాన్ని ఒక తాజా సర్వే గణాంకాలతో సహా వెల్లడించి అందర్నీ పోయేలా చేస్తోంది.

ఈవై, రిఫైన్ అనే రెండు సంస్థలు కలిసి ఒక సర్వే నిర్వహించి ఉద్యోగుల జీతాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించాయి.ఈ సర్వేలో పాల్గొన్న ఉద్యోగులందరూ తమ జీతాలు నెలలో ఎన్ని రోజుల వరకు సరి పోతున్నాయో తెలియజేశారు.

80 శాతం మంది ఉద్యోగులు నెలాఖరులోపే తమ పర్సులు ఖాళీ పోతున్నాయని వాపోయారు.లక్షకు పైగా జీతం వచ్చే వారిలో 60 శాతం మంది తమ జీతం నెల చివరి వరకు సరిపోవడం లేదని తెలిపారు.34 శాతం మంది ఉద్యోగులు నెలలో మొదటి 15 రోజుల్లోపే తమ జీతం అంతా ఖర్చు అయిపోతుందని వెల్లడించారు.ఇక రూ.15,000 లేదా అంతకన్నా తక్కువ జీతం పొందే వారు ప్రతినెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.కేవలం 13 శాతం మంది మాత్రమే తమ వేతనంలో కొంత పొదుపు చేయగలుగుతున్నానని చెప్పారు.

Telugu Cost, Effect, Employees, Empty, Latest, Purse, Detauls-Latest News - Telu

నెల ఖర్చులకే జీతం చాలక.సొంతింటి కల నెరవేర్చుకోలేమోనని, పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని ఉద్యోగులు అసంతృప్తితో జీవనాన్ని సాగిస్తున్నారు.జీతం గురించి అడిగితేనే మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.అయితే పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా ప్రతినెలా ఒక బడ్జెట్ రూపొందించుకొని ముందుకు సాగాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఆడంబరాలకు వెళ్లకుండా అవసరం లేని వస్తువులు కొనకుండా పొదుపు పెద్దపీట వేయాలని చెబుతున్నారు.స్థోమతకు మించిన వస్తువులు కొనుగోలు చేసి ఈఎంఐ ఉచ్చులో పడవద్దని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube