మందు బాబులను ఏడిపించిన శునకం.. వీడియో వైరల్

సాధారణంగా యానిమల్స్, మనుషుల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది.మనం ఎంత ప్రేమ అయితే వాటిపై చూపిస్తామో అవి కూడా మనపై అంతే ప్రేమను కలిగియుంటాయి.

 Funny Dog Video Viral : Broken Liquor Bottles With Stick, Dog Video Viral, Dog,-TeluguStop.com

మనం ఒక్కోసారి కనిపించకుండా పోయి తిరిగి సడన్‌గా కనిపించినప్పుడు వాటి బిహేవియర్ చూస్తే అర్థం అవుతుంది, అవి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాయో.! అంతేకాకుండా విశ్వాసానికి మారుపేరుగా మనం శునకాలను పిలుస్తుంటాము.

వాటి మన పట్ల ప్రేమను ప్రదర్శించడమే కాకుండా ఒక్కోసారి అవి చేసే చేష్టల వలన ఫుల్లు నవ్వొస్తుంది.ఒక్కోసారి కోపం కూడా తెప్పిస్తుంటాయి.అయినా, మనం వాటిని ఏమీ అనలేము.కారణం మీకూ తెలుసు.

అయితే, కొందరు తమ ఆవేశాన్ని, ఒత్తిడి దూరం చేసుకునేందుకు ఎక్కువ సమయం పెట్స్‌తో గడుపుతుంటారు.ఫలితంగా బాడీకి వ్యాయామం చేసినట్టు అవుతుంది.ఒత్తిడి కూడా దూరం అవుతుంది.అందుకే చాలా మంది తమ పెట్స్‌తో వాకింగ్‌కు వెళ్తుంటారు.

ఇలా చేయడం చాలా మంచి అలవాటని నిపుణులు కూడా చెబుతున్నారు.ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందట.

కొందరు ఒంటరి తనాన్ని బాగా ఇష్టపడేవారు వారి ఫీలింగ్స్, బాధలను పెట్స్‌తో చెప్పుకుంటుండటం కూడా వారిని గొప్ప అనుభూతిని కలిగిస్తుందట.ఒంటరితనాన్ని పెట్స్ దూరం కూడా చేస్తాయట.

ఇక శునకాలు, పిల్లులు చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు.ఎప్పుడూ ఏదో ఒక పని పెడుతూనే ఉంటాయి.తాజాగా ఓ శునకం చేసిన పని నెటిజన్లను బాగా ఆకట్టుకోవడమే కాకుండా నవ్వు తెప్పిస్తోంది.అయితే, ఈ వీడియోను వీక్షించిన మందు బాబులు మాత్రం తెగబాధపడ్డారని తెలిసింది.

జర్మన్ షెపర్ట్ జాతికి చెందిన ఓ కుక్క ఓ పొడవాటి కర్రను నోట్లో పెట్టుకుని ఇంట్లోకి పరుగెడుతుంది.ఈ క్రమంలోనే అక్కడే వుడ్ రాక్ అండ్ సోఫాకు గట్టిగా తలుగుతుంది.

ఆ వుడ్ రాక్‌లో ఉన్న మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులు కిందపడిపోగా పెద్ద శబ్దం వస్తుంది.బాటిళ్లు పగిలి మద్యం అంతా కిందపోతుంది.అయితే, వెంటనే అక్కడి నుంచి బయటకు పరిగెత్తిన కుక్క మళ్లీ నెమ్మదిగా తనకేమీ తెలీదు అన్నట్టు ఇంట్లోకి వస్తుంది.ఈ దృశ్యాలు ఆ ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ఆ ఓనర్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube