హైదరాబాద్ వద్దు...అమెరికానే ముద్దు...తరలిపోతున్న సీనియర్ టెకీలు..!!

అగ్ర రాజ్యం అమెరికాలో ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం, వెనక్కి తిరిగి చూసుకోకుండా స్థిరపడే మంచి అవకాశం దొరికితే ఎవరు ఒదులుకుంటారు చెప్పండి.ఎలాంటి వారైనా తుర్రున అమెరికా చెక్కేస్తారు.

 Indian Techies Aspiring To Move To The Us,us, Indian Techies, America, It Techie-TeluguStop.com

కరోనా పుణ్యమా అంటూ ప్రస్తుతం అమెరికాలో సీనియర్ ఐటీ నిపుణులకు డిమాండ్ భారీగా ఉండటంతో ప్రస్తుతం భారత్ లోని సీనియర్ టెకీల దృష్టి మొత్తం అమెరికా వైపుగా చూస్తోంది.భారతీయ కంపెనీలలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న అనుభవం ఉన్నా జీతం అందరికంటే ఎక్కువగా ఉన్నాసరే అవన్నీ కాదనుకుని అంతకంటే ఎక్కువ ఆఫర్ చేస్తున్న అమెరికా కంపెనీలవైపు పయనమవుతున్నారు నిపుణులు.

కోవిడ్ నుంచీ ఇప్పుడికిప్పుడే కోలుకుంటున్న అమెరికా ఐటీ వ్యవస్ట  భారతీయ ఐటీ నిపుణుల కోసం గేలం వేస్తోంది.ఈ క్రమంలోనే ఆకర్షణీయమైన జీతాలు, అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది.

దాంతో భారత్ నుంచే భారీగా సీనియర్స్ తరలి వెళ్తున్నారట.అంతేకాదు ఐటీ నిపుణులను సప్ప్లై చేసే రాష్ట్రంగా పేరొందిన హైదరాబాద్ లోని పలు కంపెనీలలో సుమారు 15 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా కూడా చేసేశారట.

హైదరాబాద్ లో దాదాపు 7 లక్షలకు దగ్గరలో ఐటీ నిపుణులు ఉంటారని అంచనా వీరిలో సీనియర్స్ అందరూ అమెరికా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.మేనేజర్, టీమ్ లీడర్ వంటి విభాగాలలో పనిచేస్తున్న సీనియర్స్ ఉద్యోగాలకు రాజీనామ చేస్తున్నారట.

హైదరాబాద్ ఐటీ రంగంలో గతంలో 10 శాతం ఖాళీలు ఉండగా నేడు ఆ పరిది 20 శాతానికి వెళ్లిందంటే కారణం సీనియర్స్ వెళ్ళిపోవడమేనని ఈ ఖాళీలో అధికశాతం సీనియర్స్ ఉన్నారని తెలుస్తోంది.ఇదిలాఉంటే కెనడా ,యూకే దేశాలు సైతం భారతీయ టెకీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయట.

కరోనా కారణంగా కుదిరిన ఐటీ రంగానికి మళ్ళీ పూర్వవైభవం తెచ్చేందుకు ఈ చర్యలు చేపడుతున్నాయని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube