ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రు ? టీడీపీ కి దెబ్బేగా ?

నందమూరి వారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీకి ఇక సంబంధం లేదన్నట్లుగా టిడిపి నేతలు విమర్శలు చేశారు.చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ మేనత్త భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానించే విధంగా మాట్లాడినా.

 Ntr Fans Angry On Tdp, Tdp, Chandrababu, Jagan, Ysrcp, Ap, Ap Asembly, Cbn, Loke-TeluguStop.com

ఎన్టీఆర్ ఏదో స్పందించాలి కాబట్టి స్పందించారు  తప్ప , వైసీపీ నేతల పై ఘాటుగా విమర్శలు చేయకపోవడం టీడీపీ  అగ్రనేతలకు మరింత మంట పుట్టించింది.ఎప్పటి నుంచో ఎన్టీఆర్ విషయంలో తీవ్ర ఆగ్రహం గానే చంద్రబాబు, లోకేష్ ఉంటూ  వస్తున్నారు .ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్టీఆర్ టీడీపీ లో యాక్టివ్ కావాలని మళ్లీ పార్టీ బాధ్యతలు పూర్తిగా తీసుకుని ముందుకు నడిపించాలని,  అప్పుడే తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుంది అంటూ పదేపదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు , టీడీపీ లో కొంతమంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు .

చంద్రబాబు,  లోకేష్ పర్యటనల్లోనూ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ,  భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తదితర అంశాలు అటు చంద్రబాబు ఇటు లోకేష్ కు ఇబ్బందికరంగా మారింది.లోకేష్ ను పూర్తిగా టీడీపీ లో యాక్టిివ్ చేయాలని చూస్తున్న సమయంలోనే,  ఎన్టీఆర్ ప్రస్తావన పదేపదే వస్తుండడం వంటి వ్యవహారాలు చికాకు కలిగిస్తున్నాయి.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ను మరింత దూరం చేసేందుకు సరైన సందర్భం వచ్చిందని భావించిన చంద్రబాబు,  కావాలని పార్టీ నేతలతో ఆయనపై విమర్శలు చేయిస్తున్నారు అనే అనుమానాలు ఎన్నో రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి .అయితే ఈ పరిణామాలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో టీడీపీ విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో,  ఎన్టీఆర్ తో ఎన్నికల ప్రచారం చేయించుకుని ఆ తర్వాత ఆయనను పూర్తిగా పక్కన పెట్టారని,  ఇప్పుడు లోకేష్ కోసం ఎన్టీఆర్ కు టీడీపీ తో పూర్తిగా సంబంధాలు లేకుండా చేసే విధంగా తమ పార్టీ నాయకులతో విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ap Asembly, Ap Cm, Budda Venkanna, Chandrababu, Jagan, Jr Ntr, Lokesh, Nt

ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ  అన్నట్లుగా పరిస్థితి మారడంతో , ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చుతాయి అని,  లక్షలాది మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ కి దూరం అవుతారు అని,  ఇప్పటివరకు పార్టీకి అనుబంధంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇకపై టీడీపీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉందనే అంచనా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్టీఆర్ స్పందించలేదు.  ఆయన కుటుంబంతో సహా విదేశాల్లో ఉండడంతో,  ఈ పరిణామాలపై ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube