26/11 Mumbai Attacks: 13 ఏళ్లయినా మానని గాయం.. బాధితులకు ఇజ్రాయెల్‌లోని భారతీయుల నివాళి

భారతదేశ వాణిజ్య రాజధాని ముంబైలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు సృష్టించిన 26/11 మారణహోమానికి నేటితో 13 ఏళ్లు నిండాయి.ఈ ఘటన ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది.2008 నవంబర్‌ 26న జరిగిన నరమేధాన్ని.భారత్‌తో పాటు ప్రపంచదేశాలు ఇప్పటికీ మరిచిపోలేదు.

 Indians In Israel Remember 2611 Mumbai Terror Attack Victims-TeluguStop.com

ఆ చేదు జ్ఞాపకానికి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.నాటి దాడుల్లో వీర మరణం పొందిన పోలీసులు, భద్రతా సిబ్బందికి, ప్రజలకు భారతదేశం ఘనంగా నివాళులు అర్పిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయులు సైతం 26/11 ముంబై దాడుల్లో మరణించిన వారికి నివాళులర్పించారు.ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడం ద్వారానే బాధితులకు న్యాయం చేసినట్లని వారు అన్నారు.

ఇజ్రాయెల్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులు, భారతీయ యూదు సంఘం సభ్యులు, అక్కడ పనిచేస్తున్న భారతీయులు అక్కడ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి 26/11 దాడుల బాధితులకు నివాళులర్పించారు.సితార్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతీయ యూదు నాయకుడు ఐజాక్ సోలమన్ మాట్లాడుతూ.

భారత్- ఇజ్రాయెల్‌లు శాంతిని కోరుకుంటున్నప్పటీకి పొరుగు దేశాలు మాత్రం ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నాయని అన్నారు.ఈ సందర్భంగా ఉగ్రవాదులను అడ్డుకోవడంలో తమ ప్రాణాలను కోల్పోయిన భారతీయ భద్రతా దళాలకు వారు నివాళులర్పించారు.

Telugu Ajmal Kasab, Arabian Sea, Terrorism Squad, Hemant Karkare, Indiansisrael,

కాగా.పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం గుండా ముంబైలోకి చొరబడిన 10 మంది సభ్యుల లష్కరే తోయిబా ఉగ్రవాదుల ముఠా….తాజ్‌, ఒబెరాయ్ హోటల్స్‌, చత్రపతి శివాజీ టెర్మినల్‌ దగ్గర నాలుగు రోజుల పాటు రక్తపుటేరులు పారించారు.ఈ దాడిలో అధికారికంగా 166 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

అయితే, పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు.

ఈ కేసులో సుధీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం అతడికి ఉరిశిక్ష విధించడంతో నాలుగేళ్లకు దానిని అమలు చేశారు.ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లోని మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌, ముంబయి అదనపు పోలీస్‌ కమిషనర్‌ అశోక్‌‌ కాంతే సహా 18 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube