వరుసగా ఏడు ఫ్లాపుల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన మూవీ ఏదో తెలుసా?

స్టార్ హీరో నాగార్జున ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావడంలో విఫలమవుతున్నాయి.ఊపిరి తర్వాత ఆ స్థాయి సక్సెస్ ను సాధించడంలో నాగార్జున ఫెయిల్ అవుతున్నారు.

 Interesting Facts About Nagarjuna President Gari Pellam Movie Details, Bangarraj-TeluguStop.com

పలు ఏరియాల్లో ఊపిరి బ్రేక్ ఈవెన్ కాలేదనే కామెంట్లు సైతం వినిపించాయి.అయితే బంగార్రాజు సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నాగ్ భావిస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నాగ్ అనుకుంటున్నారు.

అయితే చాలా సంవత్సరాల క్రితం నాగ్ నటించిన ప్రెసిడెంట్ గారి పెళ్లాం సినిమాకు ముందు నాగ్ నటించిన ఏడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

కెరీర్ లో నాగార్జున ఒడిదొడుకులు ఎదుర్కొన్న సమయంలో నాగార్జున ఈ సినిమాతో హిట్ సాధించారు.కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా వి.దొరస్వామిరాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.మీనా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

కైకాల సత్యనారాయణ, చంద్ర మోహన్, శ్రీకాంత్, బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

Telugu Bangarraju, Naga Chaitanya, Nagarjuna, Gari Pelam, Flop, Tollywood, Upiri

మాస్ ప్రేక్షకులలో నాగార్జునకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టిన సినిమాలలో ప్రెసిడెంట్ గారి పెళ్లాం ఒకటని చెప్పవచ్చు.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలు హిట్టయ్యాయి.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సాధించింది.

Telugu Bangarraju, Naga Chaitanya, Nagarjuna, Gari Pelam, Flop, Tollywood, Upiri

నాగ్ తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలలో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు.కొత్త డైరెక్టర్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిన హీరోగా నాగార్జునకు మంచి పేరు ఉంది.నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.బంగార్రాజు సినిమాలో నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube