కేసీఆర్‌కు షాక్ ఇస్తున్న ఆ నేత‌.. ప్లాన్ రివ‌ర్స్ అయ్యిందే

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఢిల్లీ పరిసరాల్లో నెలల పాటు రైతులు ఆందోళన చేశారు.వీరికి నాయకత్వం వహించి దేశంలో ఫేమస్ అయిన రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్.

 That Leader Who Is Giving A Shock To Kcr The Plan Has Been Reversed, Kcr, Rakesh-TeluguStop.com

తర్వాత ఇటీవలే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.ఆ చట్టాలను సైతం రద్దు చేసింది.

ఈ పరిణామాల తర్వాత తాజాగా హైదరాబాద్‌కు వచ్చాడు రాకేశ్ టికాయత్.ఇక్కడ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు.

అయితే ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాయి.ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.ముందు నుంచే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నదని, ఈ విషయం దేశం మొత్తానికి తెలుసన్నారు.అయితే బీజేపీకి టీఆర్ఎస్ పార్టీయే కాకుండా మజ్లిస్, వైసీపీ లు సైతం బి టీంగా ఉన్నాయంటూ ఆరోపించారు.ఇలా కేంద్రానికి ముందు నుంచి మద్దతిస్తున్న కేసీఆర్.

సాగు చట్టాలకు టీఆర్ఎస్ వ్యతిరేకమని చెబితే నమ్మబోమని తెలిపారు.రైతు ఉద్యమంపై తన వైఖరిని టీఆర్ఎస్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Telugu Bjp, Cm Kcr, Farmers Bills, Farmers, Kisansamyukth, Rakesh Tikait-Telugu

మోడీ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నదని ఆరోపించారు.అదానీ, అంబానీ వంటి వ్యక్తుల ఆదేశాలమేరకే సంఘ్ పరివార్ పనిచేస్తున్నదని సంచలన ఆరోపణలు చేశారు.కిసాన్ సంయుక్త్ మోర్చా. బీజేపీకి మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.మోర్చా దేశం కోసం మాత్రమే పనిచేస్తుందని ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోదని తెలిపారు.ఢిల్లీ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తానంటున్న సీఎం కేసీఆర్.తెలంగాణలో చనిపోయిన రైతులకు సైతం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దేశంలో పండే ప్రతి పంటకూ మద్దతు ధర ఇవ్వాలని, అదే తమ మెయిన్ డిమాండ్ అని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube