భారత రైల్వే శాఖ మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ నిర్ణయంతో రైలు ప్రయాణికులకు లబ్ది చేకూరనుంది.
రైలులో ప్రయాణం చేసే వారు ఆహారం కోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇకమీదట రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ వంటి అన్ని ప్రీమియం రైళ్లలో ఇకమీదట వండిన ఆహారాన్ని అందించే క్యాటరింగ్ సేవలను మళ్ళీ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.ఇప్పటికే రైల్వే అన్ని శాఖలు, విభాగాలకు ఆర్డర్స్ కూడా జారీ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ క్యాటరింగ్ ఖర్చులను జోనల్ రైల్వేలు నిర్ణయిస్తాయి.ఈ టారిఫ్ జాబితాను త్వరలోనే PRS సాఫ్ట్‌వేర్ లో అప్డేట్ చేస్తారు.
అలా అప్డేట్ అయిన తరువాత టికెట్ బుకింగ్ సమయంలోనే ఫుడ్ క్యాటరింగ్ ఆప్షన్‌ను ప్రయాణికులు ఎంచుకోవచ్చు.
మరి ఈ క్యాటరింగ్ సర్వీస్‌ను ఏ తేదిన తిరిగి ప్రారంభిస్తారో ఇంకా నిర్ణయించలేదు.
ఇదిలా ఉండగా తాజాగా రైల్వే విభాగం నిర్వహించిన ఒక సర్వేలో ప్యాక్ చేసిన భోజనాలను 7 నుంచి 10 శాతం మంది ప్రయాణికులు మాత్రమే తీసుకున్నారని, అదే వండిన భోజనం అయితే 40 నుంచి 70 శాతం మంది ప్రయాణికులు ఎంచుకున్నారని తెలిసింది.అందుకనే వండిన ఆహారాన్ని ప్రయాణికులకు అందించాలని రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తుంది.
మరి ప్రయాణికులు ఈ ఫుడ్ ను ఎలా ఆర్డర్ చేయాలి అంటే ముందుగా ప్రయాణికులు ఐఆర్సిటిసి కి చెందిన eCatering అధికారిక వెబ్‌సైట్ అయిన https://www.ecatering.irctc.co.in/కి వెళ్లాలి.
ఆ తరువాత మీరు బుక్ చేసుకున్న పది అంకెల PNR నంబర్ ను ఎంటర్ చేసి, తరువాత ప్రోసెస్ కోసం బాణం గుర్తుపై క్లిక్ చేయాలి.అప్పుడు మీకు అందుబాటులో ఉన్న కేఫ్ లు, అవుట్‌లెట్ లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ల జాబితా కనిపిస్తుంది.మీకు నచ్చిన రెస్టారెంట్ లో నుంచి మీకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసి, పేమెంట్ మోడ్ ను ఎంచుకొండి.
ఆ తరువాత ఆన్‌లైన్ పేమెంట్ లేదా క్యాష్ ఆన్ డెలివరీని అనే అప్షన్స్ మీకు కనిపిస్తాయి.మీకు నచ్చిన పేమెంట్ మోడ్ ను ఎంచుకుని ఓకే చేయండి.
ఆర్డర్ బుక్ అయిన తర్వాత ఆ ఆహారాన్ని మీరు ఉన్న సీటు లేదంటే బెర్త్ కు వాళ్లే డెలివరీ చేస్తారు.అంతే ఎంచక్కా మీకు కావలిసిన ఆహారం ఎటువంటి శ్రమ లేకుండా మీ చెంతకు వస్తుంది.