అబద్ధం చెప్పి స్కూల్ కు డుమ్మా కొట్టిన మ‌హిళా టీచ‌ర్‌.. కానీ ఫేస్ బుక్ ప‌ట్టించిందిగా..

అబ‌ద్ధం చెప్పి త‌మ ఎంజాయ్ మెంట్‌ను సొంతం చేసుకుంటున్నారు చాలామంది.ఒకప్పుడు అబ‌ద్ధం చెప్పాలంటే చాలా వెన‌క ముందు ఆడేవారు.

 The Female Teacher Who Absent To School By Lying But Caught In Facebook Details,-TeluguStop.com

కానీ ఇప్పుడు అలా కాదు.చాలా ఈజీగానే అబ‌ద్ధాలు ఆడేస్తున్నారు చాలామంది.

ఇక ఏదైనా ఉద్యోగం చేసే వారు అయితే సెల‌వుల కోసం చాలా అబ‌ద్ధాలు ఆడి బాస్‌కు టోపీ పెట్టేస్తున్నారు.ఇప్పుడు కూడా ఓ టీచ‌ర్ ఇలాగే చేసి చివ‌ర‌కు అడ్డంగా బుక్ అయిపోయింది.

దాంతో ఆమె ఉద్యోగం పోగొట్టుకోవ‌డ‌మే కాకుండా ఇక ఎక్క‌డా ఉద్యోగం చేసే ఛాన్స్ లేకుండా చేసుకుంది.ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

వేల్స్ దేశానికి చెందిన ఓ టీచ‌ర్ ఎలాగైనా త‌న బాయ్ ఫ్రెండ్ తో రోమ్‌కు టూర్ వెళ్లాల‌నుకుంది.అయితే ఒక‌టి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ సెలువులు ఇవ్వ‌ర‌నే కార‌ణంగా త‌న‌కు ఆరోగ్యం బాగా లేద‌నిచెప్పి నాలుగు రోజులు సెల‌వులు కోరింది.

నిజ‌మే కావ‌చ్చు అనుకుని యాజ‌మాన్యం సెల‌వులు ఇచ్చేసింది.అయితే ఆమె ఎంచ‌క్కా బాయ్ ఫ్రెండ్ తో రోమ్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా.ఆమె అత్యుత్సాహం కొంప ముంచింది.

బాయ్ ఫ్రెండ్ తో క‌లిసి దిగిన ఫొటోల‌ను ఫేస్ బుక్‌లో పోస్టు చేసేసింది.

Telugu Boyfriend, Council, Female Teacher, Lied, Rome, Unhealhty, Wales Teacher-

ఇంకేముంది ఆ ఫొటోలు కాస్తా నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అయిపోయాయి.ఎందుకంటే ఆమె ట‌బ్ లో అలాగే బార్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోల‌ను షేర్ చేయ‌డంతో అవి కాస్తా త‌మ యాజ‌మాన్యం దృష్టికి వెళ్లాయి.ఇక వాటిని చూసిన హెచ్ ఎం షాక్ అయిపోయింది.

మామూలుగానే ఫేస్ బుక్‌లో ఏది పెట్టిన అంద‌రికీ తెల‌సిపోతుంది.ఆ విష‌యం ఆ టీచ‌ర‌మ్మ మ‌ర్చిపోయింది.

అదే ఆమె కొంప ముంచింది.ఇక దీనిపై ఎడ్యుకేష‌న్ కౌన్సిల్ లో విచార‌ణ కూడా జరుగుతోంది.

ఒక‌వేళ ఆమెను దోషిగా ప‌రిగ‌ణిస్తే మాత్రం ఆమెకు సంబంధించిన టీచింగ్ లైసెన్సు క్యాన్సిల్ చేసే అవ‌కాశం కూడా ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube