దృశ్యం 2 రివ్యూ: రెండవసారి కూడా అదిరిపోయిన దృశ్యం!

జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఈరోజు ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సినిమా దృశ్యం 2.గతంలో ఈ సినిమా దృశ్యం గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

 Drishyam2 Telugu Movie Review And Rating, Drishyam2,drishyam2 In Telugu, Venkate-TeluguStop.com

ఇక అదే సీక్వెల్ తో దృశ్యం 2 గా తెరకెక్కింది.ఇందులో వెంకటేష్, మీనా కీలక పాత్రలో నటించారు.

అంతేకాకుండా నదియా, నరేష్, పూర్ణ, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, కృతిక, ఈస్టర్ అనిల్ వంటి తదితరులు నటించారు.డి సురేష్ బాబు, ఆంథోనీ పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సురేష్ ప్రొడక్షన్స్, ఆశిర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్ పై నిర్మించారు.

ఈ సినిమాకు సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

ఈ రోజు ఈ సినిమా విడుదల కాగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.

Telugu Amazon Prime, Drishyam, Drishyamgenuine, Drishyam Telugu, Drishyam Public

కథ:

ఇందులో వెంకటేష్ రాంబాబు పాత్రలో కేబుల్ బిజినెస్ నుండి సినిమా థియేటర్ ఓనర్ గా మారుతాడు.ఇక ఇందులో రాంబాబు సినిమా తీయడమే లక్ష్యంగా భావించుకుంటాడు.అలాగే గతంలో జరిగిన వరుణ్ హత్య కేసు ఈ కుటుంబాన్ని ఇప్పటికీ వదలలేదు.

అలా రాంబాబు జీవితంలోకి గీత ప్రభాకర్ (నదియా, నరేష్) ఎంట్రీ ఇవ్వటంతో మళ్లీ రాంబాబు కుటుంబానికి కష్టాలు వస్తాయి.దీంతో గతంలో వరుణ్ కేసు విషయంను గీత ప్రభాకర్ ఎందుకు తిరిగి తోడారు.

మళ్లీ రాంబాబు నుంచి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు.రాంబాబు పూడ్చిన శవం దొరుకుతుందా లేదా.

ఇక ఈ సమస్యల నుంచి రాంబాబు ఎలా బయటపడతాడు అనేది మిగిలిన కథలో చూడవచ్చు.

Telugu Amazon Prime, Drishyam, Drishyamgenuine, Drishyam Telugu, Drishyam Public

నటినటుల నటన:

వెంకటేష్, మీనా, నదియా, నరేష్ తమ పాత్రల్లో మునిగిపోయారు.కృతిక, ఎస్తర్ లు కూడా తమ పాత్రలో లీనమయ్యారు.ఇందులో పోలీస్ పాత్రలో కూడా నటులు బాగా నటించారు.

టెక్నికల్:

ఈ సినిమాను డైరెక్టర్ జీతూ జోసెఫ్ బాగా ఆసక్తిగా తెరకెక్కించాడు.ఈయన చూపించిన కథ తీరు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాకు మ్యూజిక్ అద్భుతంగా అందించాడు అనూప్ రూబెన్స్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంది.

సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది.

Telugu Amazon Prime, Drishyam, Drishyamgenuine, Drishyam Telugu, Drishyam Public

విశ్లేషణ:

ఈ సినిమాకు దర్శకుడు సెకండాఫ్ తో హైలెట్ గా నిలిచాడు.ఇందులో అందరి పాత్రలను అదిరిపోయేలా చేశాడు.ఎమోషనల్ తీరు మాత్రం బాగా చూపించారు.ఒక కొడుకు కోసం తపన పడుతున్న తల్లిదండ్రుల బాధలను బాగా తెరకెక్కించాడు దర్శకుడు.

ప్లస్ పాయింట్స్:

మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్, నటీనటుల పెర్ఫార్మెన్స్, కథ

మైనస్ పాయింట్స్:

ఇందులో చాలా వరకు ఎటువంటి మైనస్ పాయింట్స్ లేకపోగా ఫస్టాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపించింది.

బాటమ్ లైన్: ఈ సినిమా దృశ్యం సీక్వెల్ గా రావటంతో ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది.ఒక కుటుంబంలో సమస్యలు వస్తే ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అనే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుంది.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube