‘‘తమిళ్’’ నేర్చుకోవడం ఈజీ.. అమెరికాలో భారత సంతతి చిన్నారి అరుదైన ఆవిష్కరణ

పెద్దలకు తాము ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు అమెరికాలోని భారత సంతతి చిన్నారులు.చదువు, ఆటపాటలు సహా పలు అంశాల్లో ప్రతిభ చూపుతూ తల్లిదండ్రులకు, దేశానికి పేరు తీసుకొస్తున్నారు.

 Indian American Youngster Smaran Ramnath Develops App To Learn Tamil Language ,-TeluguStop.com

తాజాగా ఇండో అమెరికన్ బాలుడు అరుదైన ఆవిష్కరణ చేశాడు.కాలిఫోర్నియాలోని యోర్భా లిండాకు చెందిన ఐదవ తరగతి విద్యార్ధి స్మరణ్ రామ్‌నాథ్ (10) .దక్షిణ భారతదేశానికి చెందిన క్లిష్టమైన భాష తమిళ్‌ను నేర్చుకోవడంలో యువ విద్యార్ధులకు సహాయం చేస్తున్నాడు.

కోవిడ్ 19 మహమ్మారి కాలంలో ఈ బాలుడు లెగోస్‌ని ఉపయోగించి వస్తువులను కోడింగ్ చేయడం, నిర్మించడంపై ఆసక్తిని పెంచుకున్నాడు.

కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా.ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఇంట్లో మాట్లాడే… చాలా కష్టమైన తమిళం అందరూ నేర్చుకునేందుకు వీలుగా ఏదైనా చేయాలనుకున్నాడు.

దాదాపు 247 విభిన్న అక్షరాలు, శబ్ధాలు, చిహ్నాలను కలిగి వున్న తమిళాన్ని ఇతరులు నేర్చుకోవడం చాలా కష్టం.అందుకే ఈ అడ్డంకులను అధిగమించేందుకు గాను ఒక యాప్‌ని అభివృద్ధి చేశాడు.

ఈ ఏడాది ప్రారంభంలో స్మరణ్ తయారు చేసిన యాప్ .సిలికాన్ వ్యాలీ ఛాలెంజ్‌ని గెలుచుకుంది.ఈ పోటీని యువ కోడర్‌ల కోసం BYJU’S FutureSchool నిర్వహించింది.

కోవిడ్ వెలుగులోకి వచ్చినప్పుడు స్మరణ్ మూడో తరగతి చదువుకుంటున్నాడు.లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు మూసివేయడంతో ఆ కుర్రాడు ఇంట్లో ఖాళీగా వుండటాన్ని అతని తల్లి గమనించింది.దీంతో అతనిని BYJU’S FutureSchoolలో కోడింగ్ పాఠాలు నేర్చుకోవాలని సూచించింది.

దీని సాయంతో గణితం, కోడింగ్, సంగీతాన్ని వర్చువల్‌గా నేర్చుకోవచ్చు.తల్లి సూచన మేరకు స్మరణ్ జూన్ 2020లో ఒక ట్రయల్ కోర్స్ తీసుకున్నాడు.

Telugu Indianamerican, Legos, Silicon Valley, Smaran, Tamil, Yorba Linda-Telugu

ఆగష్టు  2020లో BYJU ఛాలెంజ్ గురించి అతని టీచర్ చెప్పాడు.యాప్ ద్వారా పరిష్కరించగల సమస్య గురించి ఆలోచించాల్సిందిగా సూచించాడు.ఈ సమయంలో అతనికి తట్టిందే ‘‘తమిళ’’ భాష.తన మూడేళ్ల వయసులో వారానికి ఒకసారి నేర్చుకునేందుకు ప్రయత్నించానని.కానీ అది చాలా కష్టంగా వుండటంతో అందులో ప్రావీణ్యం సాధించలేకపోయాడు.దీనినే తన ప్రాజెక్ట్‌గా ఎంచుకున్న స్మరణ్.‘‘తమిళి’’ అనే యాప్‌ను రూపొందించాడు.ఇందులో 12 అచ్చులు, 18 హల్లులు, 216 సంయోగ అక్షరాలు, 1 నుంచి 10 సంఖ్యలు వున్నాయి.

ప్రస్తుతం ఆరెంజ్ కౌంటీ ప్రాంతంలోని 30కి పైగా భారతీయ కుటుంబాలు తమిళి యాప్‌ను ఉపయోగిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube