'థాంక్యూ' నుండి ఫస్ట్ లుక్ విడుదల.. స్టైలిష్ లుక్ లో చై!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ మధ్య విభిన్న కథలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఈ మధ్యనే నాగ చైతన్య శేఖర్ కమ్ములతో చేసిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

 Naga Chaitanya Thank You First Look Revealed, Happy Birthday Naga Chaitanya, Nag-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరికొంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు చైతూ.ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమాను విక్రమ్ హర్రర్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ రోజు నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాల నుండి వరుస అప్డేట్ లను వదులుతున్నారు మేకర్స్.

అలాగే థాంక్యూ సినిమా నుండి కూడా నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ పోస్టర్ అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటుంది.ఈ పోస్టర్ లో నాగ చైతన్య సరికొత్త లుక్ లో కనిపించి అందరిని ఆకట్టు కుంటున్నాడు.

స్టైలిష్ గా మాత్రమే కాకుండా ఎనర్జిటిక్ గా కూడా కనిపిస్తున్నాడు.దీంతో ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ప్రెసెంట్ ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇక చైతూ ఈ సినిమాతో పాటు నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా నుండి కూడా మేకర్స్ చిన్న బంగార్రాజు పేరుతొ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విడుదల చేసారు.ఈ సినిమాలో కూడా చైతు డిఫెరెంట్ గా పంచెకట్టులో కనిపించి సూపర్ అనిపించాడు.

https://twitter.com/SVC_official/status/1463092480815992832?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1463092480815992832%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fnaga-chaitanya-thank-you-movie-first-look-315498.html
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube