రెగ్యుల‌ర్‌గా జాగింగ్ చేస్తున్నారా? అయితే మీరివి తినాల్సిందే!

జాగింగ్‌ ఆరోగ్యానికి మేలు చేసే అద్భుత‌మైన వ్యాయామాల్లో ఇదీ ఒక‌టి.రోజుకు ఒక అర గంట లేదా క‌నీసం ప‌దిహేను నిమిషాల పాటు జాగింగ్ చేస్తే.

 Foods To Be Taken By Those Who Jogging Regularly! Foods, Jogging, Benefits Of Jo-TeluguStop.com

ఎముక‌లు, కండ‌రాలు గ‌ట్టిగా మార‌తాయి.శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వంతా క‌రిగిపోతుంది, వెయిట్ లాస్ అవుతారు, గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది, ఇమ్యూనిటీ సిస్ట‌మ్ స్ట్రోంగ్‌గా మారుతుంది, ఆలోచన శక్తిని మెరుగు ప‌డుతుంది, ఆల్జీమ‌ర్స్ కు దూరంగా ఉండొచ్చు.

ఇలా చెప్పుకుంటే పోతే చాలా ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

అందుకు ఆరోగ్య నిపుణులు కూడా రోజూ జాగింగ్ చేయ‌మ‌ని చెబుతుంటారు.

అయితే జాగింగ్ చేయాలంటే శ‌రీరానికి శ‌క్తి ఎంతో అవ‌స‌రం.అందుకే జాగింగ్ చేసే వారు ఖ‌చ్చితంగా త‌మ డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాల‌ను చేర్చుకోవాల్సి ఉంటుంది.

మ‌రి ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.

జాగింగ్ చేసే వారు ప్ర‌తి రోజు గుప్పెడు వాల్ న‌ట్స్‌ను నాన బెట్టుకుని తినాలి.

త‌ద్వారా శ‌రీరానికి శ‌క్తి ల‌భించ‌డంతో పాలుగా బోలెడ‌న్ని పోష‌కాలు ల‌భిస్తాయి.మ‌రియు వాల్ నట్స్ డైట్‌లో ఉండే మంచిగా నిద్ర ప‌డుతుంది.

దీర్ఘ‌కాలిక వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

Telugu Benefits, Foods, Tips, Latest-Telugu Health - తెలుగు హె�

అలాగే జాగింగ్ చేసే వారు రోజుకు ఒక అర‌టి పండును త‌ప్ప‌ని స‌రిగా తినాలి.అప్పుడే నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.మ‌రియు యాక్టివ్‌గా ప‌రిగెట్ట‌గ‌లుగుతారు.

Telugu Benefits, Foods, Tips, Latest-Telugu Health - తెలుగు హె�

చెర్రీ పండ్లు.జాగింగ్ చేసే వారు వీటిని కూడా డైట్‌లో చేర్చుకోవాలి.ఎందుకూ అంటే.ర‌న్నింగ్ చేసిన అనంత‌రం కండ‌రాలు నొప్పులు ప‌డుతూ ఉంటాయి.అయితే చెర్రీ పండ్ల‌లో ఉండే ప‌లు పోష‌క విలువ‌ల ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.

ఇక ఎక్కువ స‌మ‌యం పాటు జాగింగ్ చేస్తే శ‌రీరం డీహైడ్రేట్ అయిపోతుంది.

అందుకే మామూలు వాట‌ర్‌తో పాటుగా చియా సీడ్స్ వాట‌ర్‌, కొబ్బ‌రి నీళ్లు వంటివి ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube