టీడీపీ పగ్గాలకు సంబంధించి ఆ సర్వేలో ఎన్టీఆర్ టాప్.. సమయం కావాలంటూ?

తెలుగుదేశం పార్టీ పనులతో జూనియర్ ఎన్టీఆర్ బిజీ కావాలని ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో రాజకీయాల్లోకి రావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది.2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆశించిన స్థాయిలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు రాలేదు.

 Interesting Facts About Junior Ntr In Telugu Desham Party Surveys , Chandrababu,-TeluguStop.com

టీడీపీ కార్యకర్తలు సైతం జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో యాక్టివ్ అయ్యేలా చూడాలని చంద్రబాబు దగ్గర చెబుతున్నారు.

అయితే చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు.మరోవైపు ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సర్వేలలో టీడీపీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలనే ప్రశ్నకు ఎక్కువమంది తారక్ కు ఓటేశారు.

ఏ సర్వేలో చూసినా ఎన్టీఆర్ టాప్ లో ఉండటం చంద్రబాబు అభిమానులకు షాకిస్తోంది.

ఈటీవీ అధినేత రామోజీరావు ఈ సర్వేల గురించి చంద్రబాబు దగ్గర ప్రస్తావించారని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతుందని రామోజీ రావు చంద్రబాబుకు చెప్పినట్టు బోగట్టా.రామోజీరావు జూనియర్ ఎన్టీఆర్ తో కూడా రాజకీయాల గురించి చర్చించారని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత తన నిర్ణయాన్ని చెబుతానని అన్నారని సమాచారం.

Telugu Chandrababu, Ntr, Ramoji Rao-Movie

ఎన్టీఆర్ చేతిలోనే పార్టీని పెట్టడం సరైన నిర్ణయమని రామోజీరావు చంద్రబాబుకు చెప్పారని రామోజీ రావు చెప్పిన విషయాలను పరిశీలించి చంద్రబాబు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో పాటు మంచి నటుడుగా పేరుంది.ఎన్టీఆర్ రాజకీయాలలో కూడా సక్సెస్ సాధించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉండగా విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లతో తారక్ బిజీ కానున్నారు.ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube