విజయ్ దేవరకొండతో హార్స్ రైడింగ్ కు వెళ్లిన అనన్యా పాండే.. ఫోటోలు వైరల్?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి సినిమా లైగర్.ఈ చిత్రం ప్రస్తుతం అమెరికాలోని లాస్ వేగాస్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

 Ananya Panday Horse Riding With Vijay Devarakonda Viral Details, Ananya Pandey,-TeluguStop.com

ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ అనన్య పాండే పలు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.గత కొద్ది రోజుల క్రితం మైక్ టైసన్ తో ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

తాజాగా హీరోయిన్ అనన్య పాండే విజయ్ దేవరకొండ తో కలిసి హార్స్ రైడింగ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి హార్స్ రైడింగ్ చేస్తున్నటువంటి ఫోటోలను అనన్య పాండే ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ  “హౌడీ రౌడీ” అని రాసుకొచ్చింది.అదేవిధంగా గత రెండు రోజుల క్రితం లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా ఈమె షేర్ చేశారు.

Telugu Ananya Pandey, Puri Jagannath, Horse, Liger, Mike Tyson, Schedule-Movie

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాక్సర్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ క్రమంలోనే ఈ తెరపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం కోసం చిత్రబృందం అమెరికా వెళ్లారు.ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పలు పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube