టీఆర్ఎస్ విజయగర్జన తేదీ ఇదేనా ? ఏర్పాట్లు భారీగానే

తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొద్ది రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.క్రమ క్రమంగా తెలంగాణలో బిజెపి బలం పెంచుకుంటూ ప్రధాన ప్రత్యర్థిగా మారేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, దుబ్బాక హుజురాబాద్ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అభ్యర్థులు గెలవడం,  టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే సంకేతాలు బలపడుతూ ఉండడం,  ఇలా అనేక కారణాలతో కెసిఆర్ గత కొద్ది రోజులుగా టెన్షన్ గానే ఉన్నారు.

 Trs, Telangana, Kcr, Trs Vijayagarjana, Ktr, Telangana Ministers, Trs Mlcs, Trs-TeluguStop.com

అందుకే బీజేపీని ఇరుకున పెట్టేందుకు రకరకాల ఉద్యమాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అలాగే పార్టీ కార్యకర్తలలోనూ మరింత ఉత్సాహం పెంపొందించి ఎన్నికల నాటికి మరింత ఉత్సాహంగా పని చేసే విధంగా  చేసేందుకు టీఆర్ఎస్ విజయ గర్జన సభను ఉద్యమాలకు పుట్టినిల్లయిన  వరంగల్ జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,  మంత్రులు, కీలక నాయకులు అందరికీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

ప్రతి ఒక్కరూ విజయ గర్జన సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని భారీగా  జన సందోహం ఆ సభకు వచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.అయితే ముందుగా ఈ సభను మామునూరు రంగలీల మైదానంలో నవంబర్ 15 న నిర్వహించాలని భావించినా, 29న దీక్షా దివస్ రోజున అయితే బాగుంటుందని,  ఆ తేదీకి మార్చారు.

ఈ సభ నిర్వహణకు వరంగల్ జిల్లా హనుమకొండ జిల్లా మడికొండ,  దేవన్నపేట కాజీపేట ప్రాంతాలను పరిశీలించారు.చివరికి దేవన్నపేట లో ఈ నెల 5న నిర్వహించాలని చూశార.

కానీ తొమ్మిదో తేదీన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో దాన్ని వాయిదా వేశారు.

Telugu Mlc, Telangana, Trs, Trs Mlcs-Telugu Political News

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 16వ తేదీన వెలువడతుండడంతో  డిసెంబర్ 19వ తేదీన దేవన్నపేట శివారు లో నిర్వహించాలని ఫైనల్ గా డిసైడ్ అయ్యారు.దీనికోసం దాదాపు 20 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సభ ను సక్సెస్ చేసి తెలంగాణలో తన సత్తా చాటుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube