సీనియర్ హీరోలతో నటించడానికి శృతిహాసన్ కండీషన్స్ ఇవే

శృతి హాసన్. నిన్న మొన్నటి వరకు తెలుగులో టాప్ హీరోయిన్.

 Shruthi Haasan Conditions To Work With Senior Heroes Details, Shruthi Haasan, To-TeluguStop.com

అయినా.తరువాత కాలంలో ప్రేమ యాత్రల కారణంగా ఈ అమ్మడు సినిమాలకి దూరం అయ్యింది.

ఈ గ్యాప్ లో కొత్త అందాలు ఇండస్ట్రీని ముంచెత్తాయి.ఇదే సమయంలో శృతి ప్రేమ విఫలం అవ్వడం, సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చినా సరైన అవకాశాలు రాకపోవడం చకచకా జరిగిపోయాయి.

దీంతో.అంతా శృతిహాసన్ పని అయిపోయింది అనే భావించారు.

కానీ., రవితేజ సరసన నటించిన క్రాక్ మూవీ ఈ అమ్మడి అదృష్టాన్ని మార్చేసింది.

పోయిన ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన క్రాక్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకుంది.ఇందులో శృతి రోల్ కి మంచి గుర్తింపు లభించింది.

క్రాక్ తరువాత మళ్ళీ శృతిహాసన్ డేట్స్ కోసం మేకర్స్ క్యూ కట్టారు.

ఇప్పుడు శృతి వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

ముఖ్యంగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సలార్ లో శృతినే హీరోయిన్.కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ మూవీ కోసం ఇండియన్ సినీ వరల్డ్ ఆత్రుతుగా ఎదురుచూస్తోంది.ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగం అవ్వడంతో శృతి క్రేజ్ మరింత పెరిగిపోయింది.

మరి.సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్ గేర్ పై దూసుకుపోతున్న శృతిహాసన్ సీనియర్ హీరో అయిన బాలకృష్ణతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.కానీ., శృతిహాసన్ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉందట.

Telugu Salaar, Balakrishna, Prabhas, Senior Heroes, Shruthi Haasan, Shruthihaasa

సీనియర్ హీరో అయిన బాలకృష్ణతో సినిమా చేయడానికి శృతిహాసన్ కండీషన్స్ పెట్టిందట.బాలయ్య సినిమాకి దర్శకుడు గోపిచంద్ మలినేని.శృతికి బలుపు, క్రాక్ వంటి సాలీడ్ హిట్స్ ఇచ్చిన గోపిచంద్ కోసమే శృతి బాలయ్య మూవీకి ఓకే చెప్పిందట.కానీ., సినిమాలో రొమాన్స్ సీన్స్ తక్కువ ఉండాలని, తన పాత్రకు తగిన స్క్రీన్ స్పేస్ ఉండాలని, ముద్దు సన్నివేశాలు అస్సలు ఉండకూడదని శృతిహాసన్ ముందుగానే షరతులు పెట్టిందట.దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ కండీషన్స్ అన్నిటికీ ఒప్పుకునే తమ మూవీలో హీరోయిన్ గా శృతిహాసన్ ని ఫైనల్ చేసుకున్నారట.

Telugu Salaar, Balakrishna, Prabhas, Senior Heroes, Shruthi Haasan, Shruthihaasa

ఒక్క బాలయ్యకి మాత్రమే కాదు, మిగతా సీనియర్ హీరోలకు ఎవరికైనా తన విషయంలో ఇవే కండీషన్స్ అప్లయ్ అవుతాయని తేల్చి చెప్తోందట శృతి.అయితే., శృతి కండీషన్స్ కి కారణం లేకపోలేదు.శృతిహాసన్ పెద్ద హీరోల సరసన అంతగా నప్పదు.నయనతార, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ వంటి వారికి ఈ సమస్య ఉండదు.ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న శృతిహాసన్ సినిమా క్వాలిటీ కోసమే ఇలాంటి కండీషన్స్ పెడుతుందట.

మరి.సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి శృతిహాసన్ పెడుతున్న కండీషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube