పాకిస్థాన్‌లో రేపిస్టులకు అలాంటి శిక్ష.. ఏం చేస్తారో తెలిస్తే షాక్!

ప్రపంచవ్యాప్తంగా రేపిస్టుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.ముఖ్యంగా పాకిస్థాన్ దేశంలో ఇటీవలి కాలంలో మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు పెట్రేగిపోతున్నాయి.

 Such Punishment For Rapists In Pakistan  Shock If You Know What To Do,  Pakistan-TeluguStop.com

ఈ క్రమంలో నేరాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ అక్కడి ప్రజల నిరసనలు మొదలుపెట్టారు.దాంతో పాక్ ప్రభుత్వం రేపిస్టులకు కఠినమైన శిక్ష విధించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఒక కొత్త బిల్లును పాక్ పార్లమెంట్ పాస్ చేసింది.పదే పదే అత్యాచారాలకు పాల్పడే సీరియల్ రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్‌ చేయాలని ఈ బిల్లులో తీర్మానించింది.

కెమికల్ కాస్ట్రేషన్‌ అంటే.మగవారిలో సెక్స్ కోరికలు పుట్టకుండా.వారు ఎన్నడూ సంపర్కం చేయలేకుండా విత్తు కొట్టడం.కెమికల్ కాస్ట్రేషన్ అంటే మగవారి వృషణాలలో మేల్/ఆండ్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడానికి మందులు వాడటమే.

ఇలా చేయడం వల్ల రేపిస్టుల్లో శృంగార కోరికలు పూర్తిగా నశిస్తాయి.వారి మగతనం కూడా పూర్తిగా నశించిపోతుంది.

దీనివల్ల ఆడవారి దగ్గరికి వెళ్లాలంటేనే ఈ రేపిస్టులు వణికిపోతారు.

కొత్త బిల్లును నేరారోపణలను వేగంగా నిర్ధారించడానికి, కఠినమైన శిక్షలను విధించడానికి ఉద్దేశించారు.

కొత్త చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన తర్వాత పాకిస్థాన్‌లో పలు అత్యాచారాలకు పాల్పడిన లైంగిక నేరస్థులు కెమికల్ కాస్ట్రేషన్‌ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.దోషి సమ్మతితో రేపిస్టులను కెమికల్ కాస్ట్రేషన్ చేయాలని.

సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరుతూ కొత్త అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌ను అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించిన దాదాపు ఓ సంవత్సరం తర్వాత ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది.పాకిస్థాన్ క్యాబినెట్ ఆమోదించడంతో రేపిస్టులకు కఠిన శిక్షలు విధించడం ఖాయమైంది.

Telugu Jail, Latest, Pakistan, Rapist-Latest News - Telugu

ది క్రిమినల్ లా (సవరణ) బిల్లు 2021 బిల్లుతో పాటు 33 ఇతర బిల్లులను బుధవారం పార్లమెంటు ఉభయ సభ ఆమోదించింది.పాకిస్థాన్ శిక్షాస్మృతి-1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-1898లను సవరించాలని పాక్ పార్లమెంట్ యోచిస్తున్నట్టు నివేదికలు పేర్కొంటున్నాయి.కెమికల్ కాస్ట్రేషన్ అనేది ప్రధానమంత్రి రూపొందించిన నియమాల ద్వారా ఏర్పాటైన ఓ మెడికల్ ప్రక్రియ.దీని ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో లైంగిక సంపర్కం చేయలేడు.

ఇది డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కోర్టు నిర్ణయించింది.దోషిగా నిర్ధారణ రేపిస్టులకు కోర్టు మెడికల్ బోర్డు సూచన మేరకు కెమికల్ కాస్ట్రేషన్ చేస్తారు.

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని బహిరంగంగా ఉరితీయాలని.షరియాలో కాస్ట్రేషన్ ప్రస్తావన లేదని జమాత్-ఇ-ఇస్లామీ సెనేటర్ ముస్తాక్ అహ్మద్ అన్నారు.

ఇలాంటి బిల్లు వల్ల ఉపయోగం ఏమీ లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.సెక్స్ కు పనికిరాని విధంగా మగవారిని తయారుచేసే కెమికల్ కాస్ట్రేషన్‌ అనేది దక్షిణ కొరియా, పోలాండ్, యూఎస్ లోని కొన్ని రాష్ట్రాలతో సహా పలు దేశాల్లో ఒక చట్టపరమైన శిక్షగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube