కుటుంబంలో ఎవరైనా మరణిస్తే పది రోజులు ఎందుకు మైల పాటించాలి?

సాధారణంగా మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే పది రోజుల పాటు మైల పాటిస్తూ 11వ రోజు జరగాల్సిన కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం అందరితో కలుస్తారు.అయితే ఇలాగే ఎందుకు అందరికీ దూరంగా ఉంటారు ఇది ఒక ఆచారమా లేక మూడ నమ్మకమా అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

 Why We Follow The Mile For Ten Days If Someone Dies In The Family, Died In Famil-TeluguStop.com

మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ వంశానికి చెందిన వారందరూ వారి దాయాదులు మైల పాటించడం ఆచారంగా వస్తుంది.ప్రతి వంశం లోనూ ఒకరు పుట్టినప్పుడు పురుడు, మరణించినప్పుడు మైల అనేవి సాంప్రదాయంగా పాటించేవి.

ఇలా మరణించిన వ్యక్తికి సంతాపం తెలియజేస్తూ పదిరోజులపాటు మైల పాటిస్తారు.ఇలా పాటించటం వెనుక ఒక సైన్స్ దాగి ఉంది.

పూర్వకాలంలో ఒక వంశానికి చెందిన వారందరూ ఒకే చోట నివసించే వారు.ఈ క్రమంలోనే వారి కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మరణించిన వారి చుట్టూ ఎన్నో రకాల వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు చేరి ఉంటాయి.

అయితే ఆ వంశానికి చెందిన వ్యక్తి మరణించినప్పుడు వారి వంశస్థులు దాయాదులు కలుస్తారు అలాంటప్పుడు ఎన్నో రకాల వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది.అందుకోసమే ఇలా ఏ కుటుంబంలో నైనా ఒక వ్యక్తి మరణిస్తే పదిరోజులపాటు ఎవరినీ కలవకుండా ఎక్కడికి వెళ్ళకుండా మైల పాటించాలి అనే నియమాన్ని పెట్టారు.

ఇదే నియమమే ఆచారంగా మారడం వల్ల ఇప్పటికే కుటుంబంలో అయిన వ్యక్తి మరణిస్తే పది రోజుల పాటు అందరికీ దూరంగా ఉండి పదకొండవ రోజు వారికి చేయాల్సిన కార్యక్రమాలను చేసిన అనంతరం ఇతరులతో కలుస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube