ఆకాశంలో హనీమూన్ చేసుకోవాలని ఉందా.. అయితే ఈ అవకాశం మీ కోసమే..!

జీవితంలో పెళ్లి అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.పెళ్లి అయిన ప్రతి జంట కూడా తమ హనీ మూన్ ఎక్కడ చేసుకోవాలి ఏంటి అని తెగ ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు కదా.

 Want To Have A Honeymoon In The Sky .but This Opportunity Is For You Hanimun, A-TeluguStop.com

ఎందుకంటే ఇద్దరూ వ్యక్తులను పెళ్లి అనే బంధం దగ్గర చేస్తే ఆ బంధాన్ని మరింత పటిష్టం చేసి మనసులతో పాటు ఇద్దరి శరీరాలను ఒక్కటి చేసే ఘట్టమే ఫస్ట్ నైట్.వివాహం చేసుకున్న తర్వాత పెళ్ళైన దంపతులు ఆ మధుర క్షణాలను ఆస్వాదించడానికి హానీమూన్ పేరుతో విదేశాలకు గాని, ప్రత్యేక ప్రాంతాలకు గాని వెళ్లి ఎంజాయ్ చేస్తారు.

అయితే ఇప్పుడు నూతన జంటల కోసం ఎయిర్‌లైన్స్ ఒక అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది.అంటే మీ హనీమూన్ అనేది గాల్లో విహరిస్తూ విమానంలో చేసుకోవచ్చు అన్నమాట.

ఈ ఆఫర్ ను అమెరికాకు చెందిన లవ్ క్లౌడ్ జెట్ చార్టర్ అనే సంస్థ ‘రాయల్ హనీమూన్‌‘ పేరుతో నూతన దంపతుల కోసం ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది.ఇందులో భాగంగా నూతన జంటలు తమ హనీమూన్‌ను విమానాల్లో జరుపుకునేలా ప్లాన్ వేశారు.

ఇలా హనీమూన్ కోసం విమానాన్ని బుక్ చేసుకోవాలంటే మీరు 995 అమెరికన్ డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది.అంటే మన ఇండియన్ కరెన్సీ లో 73 వేల రూపాయలు.

ఇలా 995 అమెరికన్ డాలర్లు చెల్లించిన జంట కేవలం 45 నిమిషాల పాటు మాత్రమే ఆకాశంలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది.

Telugu Hanimun, Latest-Latest News - Telugu

ఒకవేళ ఆ సమయం చాలదు అనుకుంటే అదనంగా మరింత డబ్బు చెల్లించాలట.అలాగే ఈ విమానంలో కొత్త జంటకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి.హనీమూన్ కోసం విమానంలో ప్రత్యేకంగా క్వీన్ బెడ్‌ సైతం ఏర్పాటు చేశారు.

అలాగే ఈ విమానానికి కేవలం ఒకే ఒక పైలట్ ఉంటాడు.జంటకు ప్రైవసీ విషయంలో కూడా ఏలాంటి డోకా అనేది లేకుండా పైలట్ కాక్‌పిట్ కి, విమానం ఇతర భాగానికి ఎలాంటి లింక్ ఉండకుండా ఎరేంజ్ చేశారట.

గత ఏడు సంవత్సరాలుగా లవ్ క్లౌడ్ కంపనీ కస్టమర్లను ఆకర్షించేందుకు రొమాంటిక్ డిన్నర్, విమానంలో పెళ్లి ఫెసిలిటీలతో అందరి దృష్టిని ఆకర్షించింది.మళ్ళీ ఇప్పుడు విమానంలో హనీమూన్‌ అనే కొత్త కాన్సెప్ట్ ను తెర మీదకు తెచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube