అప్పడం అంటూ నాగార్జున పరువు మొత్తం తీసేసిన మాధవీలత.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.హౌస్ లో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎవరి వల్ల తప్పులు వస్తున్నాయి అన్నది గమనిస్తూ వారిని మందలించాలి.

 Actress Madhavilatha Satires On Nagarjuna In Sunny Issue Details, Madhavi Latha-TeluguStop.com

అలా కాకుండా బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతాను అంటే కుదరదు.కానీ మన బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించే వారికి షో చూసే తీరిక ఉండదు.

ఇలాంటి సమయాల్లో బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిఫ్ట్ ను గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా మాధవిలత నాగార్జున పై అప్పడం అంటూ ట్వీట్ చేసింది.

నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున సన్నీ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.సన్నీ మాటలు పట్టించుకోకుండా, సన్నీ మాటలు వినకుండా అప్పడం? తాంతా అన్నావా? లేదా?అన్నా పదాల దగ్గరే ఆగిపోయాడు నాగార్జున.ఆ పదాలు ఎందుకు అనాల్సి వచ్చిందో ఆ కారణాన్ని మాత్రం తీసుకోలేదు.కాని అప్పడం అయిపోతావ్ అని అంటావా? అప్పడం అయితే అమ్మేస్తావా? సిరిని అమ్మేస్తావా? నిన్నే అమ్మేది అని అంటావా?అంటూ సన్నీ పై ఫైర్ అయ్యాడు నాగార్జున.

ఈ విషయంపై నాగార్జున దారుణంగా ట్రోల్ చేసింది మాధవిలత.

తగలబెట్టండి సర్ తగలబెట్టండి.డియర్ ప్రైమ్ మినిస్టర్.అప్పడం అన్ పార్లమెంటర్లీ వర్డ్‌గా కన్సిడర్ చేయాలి.

ఇవాల్టి నుంచి కొత్త రూల్స్ పాస్ చేయండి.ఈ దేశంలో ఎవరు అప్పడం తినకూడదు తింటే ఒక అమ్మాయిని తినట్లు.

అప్పడాల బిజినెస్ ఓనర్స్ మీకు తెలుసా.మీరు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని… అవును అప్పడం అంటే అమ్మాయి.

అమ్మాయిని మీరు అమ్ముతారా? అని మన హీరో మిస్టర్ నాగార్జున చెప్పాడు.

అంత పెద్ద హీరో చెప్పినప్పుడు అది మనం నమ్మాలి తెలుగులో అప్పడం అంటే అమ్మాయి అనే అర్ధం అవుతుంది.దయచేసి అప్పడం అనే పదం చెడ్డ పదం, బూతు అది, అనొద్దు.తినొద్దు.

అమ్మొద్దు ధన్యవాదములు అంటూ నాగార్జున పై సెటైర్లు వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube