ఇదేం చిత్రం.. పెద్ద సాలె పురుగును నోట్లో పెట్టుకున్న వ్య‌క్తి..

కొంద‌రు మ‌నుషులు అంతే.వారి ఆలోచ‌న‌ల‌ను అంచ‌నా వేయ‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు.

 Giant Spider Crawls Out Of Man's Mouth, Freaks Out, Man, Giant Spider, Trending-TeluguStop.com

ఊహ‌కు కూడా అంద‌నంత రీతిలో వారి ప‌నులు ఉంటాయి.ఇలాంటి చిత్ర విచిత్ర‌మైన మ‌నుషుల గురించి ఇప్ప‌టికే ఎన్నో సార్లు తెలుసుకున్నాం.

వీరి ఆలోచ‌న‌లు మిగ‌తా వారికంటే కొంచెం భిన్నంగా ఉంటాయి.ఇలాటి వారి గురించి సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి వ్య‌క్తి గురించే ఓ వీడియో నెట్టింట వ‌ణుకు పుట్టిస్తోంది.ఇలాంటి విచిత్ర‌మైన మ‌నుషులు చేసే పనులు కొన్ని సార్లు మాత్ర‌మే చాలా ఫ‌న్నీగా ఉంటాయి.

ఎక్కువ సార్లు భ‌యంక‌రంగా ఉంటాయి.ఈ వైర‌ల్ వీడియోలో ఓ వ్య‌క్తి ఏకంగా సాలె పురుగుతో భ‌యంక‌ర‌మైన విన్యాసం చేశారు.నిజానికి మ‌న‌కు సాలె పురుగును చూస్తేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది.దాన్ని మ‌న నుంచి దూరంగా ఉండాల‌నే కోరుకుంటాం క‌దా.

ఎందుకంటే సాలె పురుగు అంటేనే మ‌న‌లో ఓ ర‌క‌మైన భావ‌న ఉంది.ఏదో కడుపులో దేవుతున్నట్లు ఫీలింగ్ వ‌స్తుంది.

అంతలా మ‌నం దాన్ని అస‌హ్యించుకుంటాం.అలాంటిది చేతిలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగితేనే ఇబ్బందిక‌ర ఫీలింగ్ వ‌స్తుంది క‌దా.

కానీ ఇప్పుడు మాత్రం ఓ వ్య‌క్తి ఏకంగా దాన్ని నోట్లో పెట్టేసుకున్నాడు.

విన‌డానికి ఏదోలా ఉన్నా ఇదే నిజం.చాలా పెద్ద సైజులో ఉన్న ఓ బ్లాక్ క‌ల‌ర్ సాలె పురుగుతో ఆ వ్య‌క్తి అత్యంత ప్ర‌మాద‌క‌ర విన్యాసాన్ని చేశాడు.దాన్ని బ‌తికుండ‌గానే నోట్లో పెట్టుకున్నాడు.

ఆ త‌ర్వాత నోట్లో నుంచి బయటకు తీయ‌డం మ‌న‌కు ఈ వీడియోలో క‌నిపిస్తుంది.దీన్ని చూస్తున్నంత సేపు ఒళ్లు గగుర్పొడుస్తుంది.

జూ కీపర్‌గా వర్క్ చేసే జే బ్రూవర్ ఈ వీడియోను నెట్టింట వ‌దిలాడు.ఇత‌ను ఇప్ప‌టికే ఇలాంటివి ఎన్నో చేసి ఉన్నాడు.

ఇత‌ను చేసే ఇలాంటి వీడియోల‌కు బాగానే ఆద‌ర‌ణ ఉంటుంది.అందుకే అత‌నికి ఇన్ స్టాలో 5.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube