సమంత నుంచి చాలా నేర్చుకున్నానన్న ఉపాసన.. ఆమె ప్రేమ అలాంటిదంటూ?

రామ్ చరణ్ భార్య ఉపాసన ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోయిన్లతో సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే.సేవా కార్యక్రమాల ద్వారా ఉపాసన ఎంతోమంది అభిమానులలో పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.

 Upasana Konidela Open Comments On Star Heroine Samantha Details, Samantha, Upasa-TeluguStop.com

వివాదాలకు ఉపాసన దూరంగా ఉంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొన్ని విషయాలకు సంబంధించి ఉపాసన, సమంత ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి.

ఉపాసన వెబ్ సైట్ కు సమంత అతిథి సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు.సమంత పర్యావరణ రక్షణను ప్రోత్సహించడంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు.సమంత ఉపాసన ఒకరికొకరు సహకారం అందించడం వల్ల వీళ్లిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది.తాజాగా ఇంటర్వ్యూలో ఉపాసన తాను తెలంగాణ బిడ్డనని మాంసం తింటానని చెప్పుకొచ్చారు.

దసరాలాంటి పండుగలు జరిగే సమయంలో కూడా మాంసం భుజిస్తామని ఉపాసన పేర్కొన్నారు.

Telugu Ram Charan, Samanta Divorce, Samantaupasana, Samantah Love, Samantha, Upa

అయితే సమంత యొక్క ఆర్టికల్స్ ను ఎడిట్ చేసిన తర్వాత మాంసం తినడం చాలావరకు తగ్గించానని ఉపాసన వెల్లడించారు.సమంతలో సహాయం చేసే గుణం ఉందని ఎన్నో విషయాలలో సమంత తనకు సహాయం చేసిందని ఉపాసన చెప్పుకొచ్చారు.సమంత ప్రేమ నిజమైన ప్రేమ అని ఉపాసన కామెంట్లు చేశారు.

Telugu Ram Charan, Samanta Divorce, Samantaupasana, Samantah Love, Samantha, Upa

విడాకుల తర్వాత కూడా సమంత గురించి సెలబ్రిటీలు పాజిటివ్ గానే స్పందిస్తూ ఉండటంతో సమంత ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.తాజాగా సమంత ఉపాసనతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.సమంత కొత్త సినిమాల షూటింగ్ త్వరలో మొదలుకానుండగా ఆ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

సమంతకు ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోవడంతో దర్శకనిర్మాతలు సమంతను పిలిచి మరీ భారీస్థాయిలో ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube