అమెరికాలో కూరగాయల రేట్లు వింటే.. షాక్ అవ్వాల్సిందేనట...

మార్కెట్ లో మనం కూరగాయలు కొనేటప్పుడు కిలో వంకాయలు రూ.30 చెప్తేనే అమ్మో అంత రేటా, అంటాం.కాస్త పల్లెటూరు వాతావరం అయితే ఇళ్లలోని పెరట్లో కూరగాయలు పెంచుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాంటి వారు అసలు కూరలు కొనుగోలు చేయరు కూడా.అలాంటి వారికి కిలో వంకాయ రేటు రూ.15 చెప్పినా షాక్ అవుతారు.అలాంటిది కిలో వంకాయ రేటు రూ.450 ఉంటే కొంటామా, ఆ రేటు వినగానే గుండె ఆగినంత పని అవుతుంది.మీరు విన్నది నిజమే కిలో వంకాయ రేటు అక్షరాలా రూ.400 పైమాటే.

 Vegetable Prices In America High, America, Vegetable Prices,us, Spinach, Most Ex-TeluguStop.com

అమెరికాలో మన దగ్గర దొరికే కూరల రేట్లు ఆకాశాన్ని కాదు అంతరిక్షపు లోతులకు చేరుకుంటున్నాయి.

విన్న మీరే షాక్ అవుతుంటే అక్కడ అంతేసి డబ్బులు పోసి కొంటున్న మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి.ఒక్క వంకాయ రేటు మాత్రమే కాదు అక్కడి కూరలు, ఆకు కూరల రెట్లు వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.కిలో క్యారెట్ ధర మన దగ్గర రూ.50 ఉంటె అక్కడ మాత్రం రూ.170 ఉంది.అంతేకాదు కూరలకు రారాజు వంకాయ రేటు మన దగ్గర రూ.30 ఉంటే అక్కడ మాత్రం రూ.450 ఉంది. ఇక

Telugu America, Spinach, Vegetable, Vegetables-Telugu NRI

అత్యంత ఖరీదైన కూరగాయగా పాల కూర మొదటి స్థానంలో నిలిచింది మనకు పాలకూర మూడు లేదా నాలుగు కట్టలు కలిపి రూ.20 మహా అంటే రూ.30 కి ఇస్తే అక్కడ మాత్రం రూ.500 దరిదాపుల్లో ఉంది.బంగాళదుంప, క్యాప్సికం, ఉల్లిపాయ, క్యాబేజీ, టమాటా, ఇలా అన్ని ఇక్కడ తక్కువలో తక్కువ రూ.50 లోపు ఉంటాయి కానీ అక్కడ మాత్రం వీటిని ముట్టుకుంటే షాక్ కొడుతాయి.మనకే ఈ రేట్ల విషయంలో షాకింగ్ గా ఉంటే వీటిని రోజూ కొంటూ షాకుల మీద షాకులు తింటున్న మన ఎన్నారైల పరిస్తితి ఎలా ఉంటుంది చెప్పండి.తెలిసి తెలిసి అంత ఖరీదు పెట్టాలంటే మనం ససేమిరా అనేస్తాం, కూరల కొట్టుకు వెళ్లి బేరాలు ఆడి, బెదిరించో, బుజ్జగించే ఎంతో కొంత తక్కువకు తీసుకుంటాం.

కనీసం అక్కడ బేరాలు ఆడటానికి కూడా ఉండదట…పాపం ఎన్నారైలు ఇలా ఎలా కొంటున్నారో…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube